కరోనా రాక్షసి ప్రపంచాన్నే వణికిస్తోంది. దీని దెబ్బతో లక్షల కోట్లు ఆవిరయ్యాయి. మరి కొన్ని లక్షల ఉద్యోగాలు హాంఫట్ అయ్యాయి. అనేక రంగాలు నష్టాల్లో కూరుకుపోతున్నాయి. కరోనా దెబ్బకు చివరకు అమెరికా వంటి దేశాలు కూడా అతలాకుతలం అవుతున్నాయి. తాజాగా వెలువడిన గణాంకాలు ఈ విషయాన్ని మరింతగా స్పష్టం చేస్తున్నాయి.

 

మన ఇండియన్లు చాలా మంది ఉద్యోగాల కోసం అమెరికా వెళ్తుంటారు. కానీ కరోనా దెబ్బతో అమెరికాలోనూ నిరుద్యోగం ఘోరంగా పెరిగిందట. అంటే.. కరోనా దెబ్బ అమెరికాపై చాలా తీవ్రంగా పడినట్లే కనిపిస్తోంది. కరోనా సమస్య మొదలైన తర్వాత వరసగా తొమ్మిదో వారం కూడా లక్షల మంది నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్నారట. గత వారంలో 24 లక్షలమంది తొలిసారిగా నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్నారని అమెరికా ప్రభుత్వం లెక్కలు చెబుతున్నాయి.

 

 

ఈ లెక్కలు సాక్షాత్తూ అమెరికాలోని లేబర్ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది. కరోనా మహమ్మారితో లాక్‌డౌన్‌ ప్రారంభమైన మార్చి మధ్యలో నుంచి ఇప్పటి వరకు మొత్తం 3.86 కోట్ల మంది నిరుద్యోగ భృతికి దరఖాస్తు చేసుకున్నారట. అమెరికాలో ఉద్యోగుల తప్పు లేకుండా వారిని ఉద్యోగం నుంచి తీసేస్తే, ప్రభుత్వం వారికి ప్రతి వారం నిరుద్యోగ భృతి చెల్లించాల్సి ఉంటుంది. అయితే నిరుద్యోగ భృతికి ఎవరు అర్హులనేది ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలను బట్ట ఉంటుందన్నమాట.

 

 

అయితే ఇటీవల ట్రంప్ సర్కారు కొత్త రూల్ తీసుకొచ్చింది. ప్రభుత్వం ద్వారా ఉద్యోగం పోయిన వాళ్లే కాకుండా.. సొంత వ్యాపారం చేసుకునే వారిని, ఫ్రీ లాన్సర్లను కూడా నిరుద్యోగ భృతికి అర్హులుగా చెబుతోంది. అందుకే ఉద్యోగం పోయిన వారు, ఉద్యోగం లేని వారు ఇలా అనేక మంది నిరుద్యోగ భృతికి దరఖాస్తు చేసుకుంటున్నారు.ఇలా మొత్తం నిరుద్యోగుల సంఖ్య దాదాపు 4 కోట్లకు చేరువైందన్నమాట.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: