లాక్ డౌన్ వల్ల తమ రోజువారీ తరగతులు కోల్పోయి ఇళ్ల వద్దే ఉండిపోయిన విద్యార్థులకు ఊరట కలిగిస్తూ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) దేశంలోని డిగ్రీ విద్యార్థులు అందరికీ శుభవార్త చెప్పింది. ఇకపై విద్యార్థులు కావాలంటే ఒకేసారి రెండు డిగ్రీ కోర్సులను పూర్తి చేసుకోవచ్చు. దీనిపై మేలో అధికారిక ప్రకటన కూడా విడుదల చేయనున్నట్లు తెలిసింది. విషయాన్ని స్వయంగా యు.జి.సి సెక్రెటరీ రజనీష్ జైన్ తెలిపారు. ఇక మే లో అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత విద్యార్థులంతా ఏకకాలంలో రెండు భిన్నమైన డిగ్రీ కోర్సులను పూర్తి చేసేందుకు అవకాశం ఉంటుంది.

 

అయితే ప్రకటన వెలువడిన తర్వాత చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి. ఒకే కాలేజీలో ఒకేసారి రెండు డిగ్రీ కోర్సులను చదవడం ముమ్మాటికి కుదరదు. ఒక సబ్జెక్టు యొక్క క్లాసులు జరిగే సమయంలో మరొక కోర్సు ఒక్క తరగతులు మిస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఒకే సమయంలో రెండు డిగ్రీ కోర్సులను చదవాలనుకునే విద్యార్థులు ఒక కోర్సును రెగ్యులర్ గా చేయాలి మరియు ఆన్ లైన్ ద్వారా డిస్టెన్స్ లర్నింగ్ పూర్తి చేసుకోవచ్చు. ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో మామూలు డిగ్రీ కోర్సు పై తమకు ఆసక్తి ఉన్నా మరింత ఉన్నత కోసం చేస్తున్న వారు తనకు నచ్చిన కోర్సును ఇకపై చేసుకునే వెసులుబాటు కల్పించడం తో విద్యార్థులు అంతా ఖుషీ అయ్యారు.

 

కాగా 2012లోనే ఇందుకు సంబంధించి ఒక ప్ర‌తిపాద‌న యూజీసీ ముందుకు వచ్చినా... అది అప్ప‌ట్లో కార్య‌రూపం దాల్చ‌లేదు. కానీ ప్ర‌స్తుతం విధానానికి త్వ‌ర‌లో ఆమోద ముద్ర వేయ‌నున్నారు. ఇలా రెండు డిగ్రీల‌ను ఒకేసారి పూర్తి చేయ‌డం వ‌ల్ల విద్యార్థుల‌కు ఉన్న‌త విద్యా, ఉద్యోగ అవ‌కాశాలు పుష్క‌లంగా ఉంటాయ‌ని అధికారులు భావిస్తున్నారు. అలాగే వేరొక అంశంలో నైపుణ్యాన్ని పెంచుకోవ‌డం మ‌రింత సుల‌భ‌త‌రం అవుతుంద‌ని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: