ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి గజగజా వణికిస్తోంది. కరోనా బాధితుల సంఖ్య, కరోనా మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నాయి. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్రం లాక్ డౌన్ ను ప్రకటించింది. లాక్ డౌన్ అనంతరం కూడా కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మాత్రమే కరోనాను నియంత్రించే అవకాశం ఉంటుంది. 
 
ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలు కరోనా వ్యాక్సిన్ కోసం అనేక ప్రయోగాలు చేస్తున్నారు. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ కరోనా వైరస్ వ్యాక్సిన్ విషయంలో మంచి ఫలితాలు సాధిస్తోంది. ఇప్పటికే రెండు దశల్లో క్లినికల్ ట్రయల్స్ చేసి ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ సక్సెస్ అయింది. ప్రస్తుతం ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ మూడో దశ ప్రయోగాలకు సిద్ధమవుతోంది. బయోఫార్మా సంస్థ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ కు పూర్తిగా సహకరిస్తామని పేర్కొంది. 
 
ఆస్ట్రాజెనెకా మొదట 40 కోట్ల డోసుల వ్యాక్సిన్ తయారీ కోసం ఒప్పందం జరిగిందని 100 కోట్ల డోసులను తయారు చేసేందుకు కంపెనీ సంసిద్ధంగా ఉందని పేర్కొంది. సెప్టెంబర్ లో తొలి విడత వ్యాక్సిన్ సరఫరాలను చేపడతామని తెలిపింది. అమెరికన్‌ బయోమెడికల్‌ పరిశోధన అభివృద్ధి సంస్థ నుంచి వ్యాక్సిన్ తయారీ, అభివృద్ధి, సరఫరా కొరకు 100 కోట్ల డాలర్లు మంజూరయ్యాయని తెలిపింది. 
 
మూడో విడతలో 30,000 మందిపై వ్యాక్సిన్ ను ప్రయోగిస్తారని పేర్కొంది. ఈ వ్యాక్సిన్ ను ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీతో కలిసి పని చేస్తామని ఆస్ట్రాజెనెకా కంపెనీ సీఈవో పాస్కల్ తెలిపారు. మరోవైపు ఇతర దేశాల్లో కూడా వ్యాక్సిన్ కోసం అనేక ప్రయోగాలు జరుగుతున్నాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే కరోనాను కట్టడి చేసే అవకాశం ఉంటుంది.                        

మరింత సమాచారం తెలుసుకోండి: