ప్రస్తుతం తెలంగాణలో కేసీఆర్ కు ఎదురే లేదు.. ఆయనకు అన్ని విధాలా పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. దీనికి తోడు ఆయన తన అనుభవంతో ప్రతి అంశాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటూ విపక్షాలకు అస్సలు ఛాన్స్ ఇవ్వడం లేదు. అందుకే కేసీఆర్ కు రాజకీయంగా అంతా నల్లేరుపై నడకగా సాగిపోతోంది. అయితే ప్రధాన విపక్షం కాంగ్రెస్ మాత్రం.. ఎలాగోలా తన పూర్వవైభవం సంతరించుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

 

 

ఇక కేసీఆర్ ఫ్యామిలీ అంటే ఒంటికాలిపై లేచే రేవంత్ రెడ్డి .. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయినా.. ఆ తర్వాత ఎంపీగా ఎన్నికై పరువు దక్కించుకున్నాడు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ను ఎలాగైనా బలమైన శక్తిగా రూపొందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఆయనకు పూర్తి అధికారాలు కట్టబెట్టలేదు. అయినా సరే.. తెలంగాణ కాస్తో కూస్తో కేసీఆర్ కు సవాళ్లు విసరగల నేతగా పేరు సంపాదించాడు.

 

 

అలాంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు మరో సవాల్ విసురుతున్నారు. ముందుంది మంచి కాలం అంటూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నాడు. మనకు మంచి రోజులు వస్తాయని ఇన్‌స్పయిల్ చేస్తున్నాడు. కాంగ్రెస్ కార్యకర్తలు రాజీవ్ స్ఫూర్తితో పనిచేయాలని.. ఎవరూ ఆందోళన చెందొద్దని.. తొందర్లోనే మనకూ మంచి రోజులు వస్తాయని చెబుతున్నాడు. అంతే కాు.. ఇప్పుడు ఎవడెవడు ఎగెరిగిరి దునకుతున్నడో లెక్కలు రాసి పెట్టండి... మనకూ అధికారం వస్తుంది. మిత్తితో సహా లెక్క చెల్లిద్దాం.. అంటూ భారీ డైలాగులు చెబుతున్నారు.

 

 

నాయకుడు అన్నాక ఆ మాత్రం విశ్వాసం ఉండాల్సిందే.. కానీ కేవలం ఆత్మ విశ్వాసం మాత్రమే ఉంటే కేసీఆర్ వంటి నేతను మట్టికరిపించడం అంత సులభం కాదన్న సంగతి రేవంత్ రెడ్డి గ్రహించాలి. శపథానికి తగ్గ శ్రమ, పట్టుదల, వ్యూహం ఉంటే తప్ప కేసీఆర్ పై పైచేయి సాధించడం అంత ఈజీ కాదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: