ప్రపంచంలో ఇప్పుడు కరోనా మహమ్మారి ఎవ్వరినీ వదల బొమ్మాళీ వదలా అంటుంది.  పుట్టిన బిడ్డ నుంచి పండు ముదుసలి వరకు పట్టి పీడిస్తుంది.  ఇలా కరోనా భారిన రోజు వందల మంది బలి అవుతున్నారు.  దౌర్భాగ్యం ఏంటంటే ఎంతో టెక్నాలజీ ఉన్న అగ్ర దేశాలు సైతం కరోనా భూతానికి భయపడిపోతున్నారు.  ఇక కరోనా బారినపడి దేశవ్యాప్తంగా మృతి చెందిన వారిలో 103 మంది 30 ఏళ్లలోపు వారేనని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో ఈ మద్య లాక్ డౌన్ సడలింపు చేశారు.. దాంతో గత నాలుగు రోజుల నుంచి 5 వేలకు పైగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి.

 

ఇక తొలిసారి దేశంలో నిన్న ఒక్క రోజే ఆరు వేలకు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. 6,198 కొత్త కేసులతో పాటుగా 150 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీనితో మొత్తం కేసుల సంఖ్య 118,226 కి చేరుకుంది. ఇక కరోనా ఆడ, మగ, థర్డ్ జెండర్ అనే మినహాయింపులు ఇవ్వడం లేదు. దీంతో ప్రభుత్వాలు అందరి కోసం ప్రత్యేకంగాగ క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేశాయి. అయితే ఇప్పటి వరకు ఉన్న క్వారంటైన్ కేంద్రాల్లో  ట్రాన్స్ జెండర్స్‌‌కు ఎలాంటి కేటాయింపులు ఇవ్వాలనే విషయాన్ని ప్రభుత్వాలు ఆలోచించలేదు.

 

ఈ నేపథ్యంలో వారి సమస్యలు దృష్టిలో ఉంచుకొని మణిపూర్ ప్రభుత్వం మాత్రం కీలక నిర్ణయం తీసుకుంది. ట్రాన్స్ జెండర్ల కోసం ప్రత్యేక క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. వారి సమస్యలను గుర్తించి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసిన ఈ పనికి పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  అంతే కాదు ట్రాన్స్ జెండర్స్ కోసం ప్రత్యేకంగా క్వారంటైన్ సెంటర్ ఏర్పాటు చేసిన తొలి రాష్ట్రంగా మణిపూర్ రికార్డు సృష్టించింది. కాగా ఇందులో ప్రస్తుతానికి 24మందికి వసతి కల్పించొచ్చు అవసరమైతే మరింత పెంచుతామని అధికారులు ప్రకటించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: