దేశంలో కరోనాతో ప్రజలు ఎన్న కష్టాలు పడుతున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. అయితే అందరూ కరోనా వ్యాధి సోకి బాధపడటం లేదు.. ఆకలి బాధ, ఉన్న చోట పనిలేక వలసలు తమ స్వస్థాలలకు వెళ్లే క్రమంలో పడుతున్న ఇబ్బందులు ఇలా  చెప్పుకుంటూ పోతే ఎన్నో కష్టాలు, కన్నీళ్లు.  గత పది రోజుల నుంచి వలస కార్మికులు తమ స్వస్థలాలకు ఎన్నో కష్టాలు పడుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఆడకూతురు తన తండ్రి కోసం చేసిన సాహసం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. మంచి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు అందులో మగవారు రోజుకు 10నుంచి 20 ఆపై మరికొంత మార్క్.. అయితే ఓ ఆడకూతురు తన తండ్రి కోసం ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 1200 కి.మీ. ప్రయాణం చేసింది.  కరోనా మహమ్మారి వల్ల రెక్కడితేగాని డొక్కాడని జనం చరిత్ర ఎరగని చరిత్రలు సృష్టిస్తున్నారు.

 

ఎవరూ పట్టించుకోపోయినా, గుర్తించకపోయినా, పిడికెడు సాయం చేయకపోయినా తన బతుకుభారాన్ని తామే మోస్తూ ఆత్మగౌరవంతో సగర్వంగా నిలబడుతున్నారు. ఈ సమయంలో గాయపడిన తండ్రిని సైకిల్ పై కూర్చోబెట్టుకుని ఓ బాలిక ఏకంగా 1200 కి.మీ తొక్కి సురక్షితంగా స్వగ్రామానికి చేరుకుంది. ఈ నెల 10న ఢిల్లీలోని గురుగ్రామ్ నుంచి మహాప్రయాణం మొదలైంది. దారిలో అష్టకష్టాలు పడుతూ నిన్న దర్భంగా చేరుకున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు ఇద్దరికీ కరోనా టెస్ట్ చేయగా, నెగిటివ్ రిజల్ట్ వచ్చింది.

 

ఇద్దర్నీ హోం క్వారంటైన్‌లో ఉంచారు. ఈ విషయం తెలుసుకున్న తెలుసుకున్న భారత సైక్లింగ్ సమాఖ్య (సీఎఫ్ఐ - సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా), ఆమెకు బంపరాఫర్ ఇచ్చింది. వెనుక ఒకరిని కూర్చోబెట్టుకుని, అంతదూరం ప్రయాణం చేసిన ఆమె శక్తి, సామర్థ్యాలు, తెగువకు ఆశ్చర్యపోయిన సమాఖ్య, నిన్న ఆమెతో ప్రత్యేకంగా మాట్లాడింది. ట్రయల్స్ కోసం ఢిల్లీకి రావాలని, ట్రయల్స్ లో సత్తా చాటితే, జాతీయ సైక్లింగ్ అకాడమీలో శిక్షణ ఇస్తామని సమాఖ్య చైర్మన్ ఓంకార్ సింగ్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: