మాటలు చెప్పి యువతిని మోసం చేసి చిక్కుకుపోయాడు ఒక యువకుడు. మా నాన్న ఎమ్మెల్సీ అంటూ ఒక వివాహితతో పరిచయం ఏర్పర్చుకొని.. కొన్ని రోజుల తర్వాత తన నిజస్వరూపాన్ని బయటపెట్టాడు. అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే వారిద్దరి ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానంటూ బ్లాక్ మెయిల్ చేశాడు. ఈ దారుణమైన సంఘటన హైదరాబాదులో చోటు చేసుకుంది. 

 


ఇక పూర్తి వివరాల్లోకి వెళితే... హైదరాబాదులోని కొండాపూర్ ప్రాంతానికి చెందిన యువతితో కొద్ది రోజుల క్రితం భరత్ కుమార్ అనే యువకుడు పరిచయం అవ్వడం జరిగింది. మా నాన్న ఎమ్మెల్సీ అంటూ ఆమెకు మాయమాటలు చెప్పి మెల్లగా ఆ యువతికి దగ్గర ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఆ యువతి ఇంటికి వెళ్లి ముచ్చట్ల చెప్పేవాడు. ఈ తరుణంలోనే వారు ఇద్దరు సన్నిహితంగా ఫోటోలు కూడా దిగారు.

 


ఇది ఇలా ఉండగా కొన్ని రోజుల తర్వాత ఆ యువకుడు లో మరో కోణాన్ని బయటపెట్టి ఆ యువతిని వేధించడం మొదలు పెట్టడం జరిగింది. మహిళని 15 లక్షల రూపాయలు ఇవ్వకపోతే మనం ఇద్దరం కలిసి తీసుకున్న సన్నిహిత ఫోటోలను సోషల్ మీడియాలో పెడతాను అంటూ ఆ యువతిని బ్లాక్ మెయిల్ చేయడం జరిగింది. ఇక దీనితో బాధితురాలు ఏం చేయాలో అర్థం కాక సైబర్ క్రైమ్ పోలీస్ అధికారులను ఆశ్రయించడం జరిగింది. దీనితో సైబర్ పోలీస్ అధికారులు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలుపెట్టారు. 

 


కాబట్టి ఎవరైనా సరే కొత్తవారు సోషల్ మీడియా ద్వారా పరిచయమైన వారికి వీలైనంత దూరంగా ఉంటేనే జీవితం ప్రశాంతంగా కొనసాగుతోంది. లేదు కాదు వారితో స్నేహాన్ని కొనసాగించారంటే అది అనర్థాలకు దారితీస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కాబట్టి వారి మాటలు గుడ్డిగా నమ్మకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ జాగ్రత్తగా ఉండండి. లేకుంటే చివరకు అవి మీ ప్రాణాలమీదికి వచ్చినా రావచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: