ఏపీలో గ‌త యేడాదిలో భ‌ర్తీ అయిన ఉద్యోగాల లెక్క ఓ సారి చూస్తే గ‌త ప‌దేళ్లు.. అంత‌కు మించి సంవ‌త్స‌రాల్లో కూడా భ‌ర్తీ కాని ఉద్యోగాల‌ను జ‌గ‌న్ ఈ యేడాది కాలంలోనే భ‌ర్తీ చేసేశాడు. జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ‌తో కొన్ని ల‌క్ష‌ల మందికి ఉద్యోగాలు ఇస్తాన‌ని చెప్పి.. ఇచ్చిన మాట ఇచ్చిన‌ట్టే నిల‌బెట్టుకున్నారు. ఇక గ్రామ స‌చివాల‌యం ఉద్యోగాల‌తో కొన్ని వేల ఉద్యోగాలు భ‌ర్తీ చేయ‌డంతో ఏపీలో చాలా వ‌ర‌కు నిరుద్యోగ కొర‌త తీరిపోయింది. ఏ వీథికి వెళ్లినా చాలా మందికి ఏదో ఒక ఉద్యోగం రావ‌డంతో వాళ్లంతా సంతోషంగా ఉన్నారు.

 

ఇలా ఈ యేడాది కాలంలో దాదాపు అన్ని రంగాల్లోనూ ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్లు భారీ ఎత్తున రిలీజ్ అయ్యాయి. మొత్తానికి యువ‌త అయితే ఫుల్ ఖుషీగా ఉన్నారు. కేవ‌లం యేడాది కాలంలో లోనే ల‌క్ష‌లాది ఉద్యోగాలు భ‌ర్తీ చేసిన జ‌గ‌న్ మ‌రో నాలుగేళ్ల‌లో ఇంకెన్ని ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తారో ? అని ఎంతో ఆశ‌ల‌తో వెయిట్ చేసే వారు కూడా ఉన్నారు. ఇక ఇప్పుడు పొరుగు తెలుగు రాష్ట్ర‌మైన తెలంగాణ‌లోనూ ఉద్యోగాల‌ను భారీగా భ‌ర్తీ చేయాల్సిన ఆవ‌శ్య‌క‌త అయితే ఏర్ప‌డింది. ఈ క్ర‌మంలోనే కేసీఆర్ కూడా జ‌గ‌న్ ను ఫాలో అయ్యేందుకు రెడీ అవుతున్నారు.

 

వ‌రుస పెట్టి కొలువుల కోసం నోటిఫికేష‌న్లు వ‌దులుతున్నారు. తెలంగాణ‌లో పంచాయ‌తీ కార్య‌ద‌ర్శుల పోస్టుల భ‌ర్తీకి రంగం సిద్ధ‌మ‌వుతోంది. ఈ పోస్టుల‌ను త‌క్ష‌ణ‌మే భ‌ర్తీ చేయాల‌ని పంచాయ‌తీ రాజ్ శాఖ క‌మిష‌న‌ర్ ఆదేశాలు జారీ చేశారు. మ‌రో రెండు వారాల్లో నోటిఫికేష‌న్ కూడా రానుంది. రాష్ట్రంలో మొత్తం 12, 751 గ్రామ పంచాయ‌తీలు ఉన్నాయి. ప్ర‌స్తుతం 2 వేల‌కు పైగా పోస్టులు ఖాళీగా ఉండ‌గా... వీటితో పాటు మ‌రి కొన్నింటిని క‌లిపి నోటిఫికేష‌న్ రిలీజ్ చేయ‌నున్నారు. ఏదేమైనా కొత్త కొలువ‌ల భ‌ర్తీతో తెలంగాణ యువ‌త‌లో స‌రికొత్త సంద‌డి అయితే నెల‌కొన‌నుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: