దేశంలో లాక్ డౌన్ కొనసాగుతుంది.. దాదాపు నలభై రోజలు పాటు జనాలు ఇంటిపట్టున ఉంటూ.. బయటి ప్రపంచం తెలియకుండా ఉన్నారు.. వాకిరి ఇష్టమైన తిండి లేక ఎవరినీ కలవని పరిస్థితి.. ఇలా కొంత మానసిక ఇబ్బందులు పడ్డారనే చెప్పొచ్చు.  అయితే లాక్ డౌన్ సందర్బంగా పడ్డ కష్టాలు ఇప్పుడు సడలింపు తో జైలు నుంచి విడుదలైన ఖైదీల్లా బాహ్యప్రపంచానికి వచ్చాం.. మాదే ఇష్టారాజ్యం అంటున్నారు.  కనీసం సామాజిక దూరం పాటించడం లేదు.. మాస్క్ లు ధరించడం లేదు. ఓ వైపు పోలీసులు ఎంత కట్టుదిట్టం చేస్తున్నా జనాలు మాత్రం అంతా మా ఇష్టం అంటున్నారు. సాధారణంగా తేరగా వస్తే జనం ఏది వదిలిపెట్టరని మరోసారి నిరూపించారు. మామిడి పండ్లు అమ్ముకునే వ్యక్తి ఆదమరిచి ఉన్న సమయం చూసి జనం ఒక్కసారిగా ఎగబడ్డారు.

 

ప్రపంచంలో తియ్యని మామిడి పండ్లు అంటే ఇష్టపడని వారు ఉండరు.. మరి అది పుణ్యానికి వస్తుందంటే ఇంకేముంది.. దొరికిన కాడికి వాటిని దోచుకెళ్లిపోయారు. ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. ఆ మామిడి పండ్ల ఖరీదు రూ.30 వరకు ఉంటుందని.. వాటిని దోచుకెళ్లిపోయే సమయంలో వారించినా ఆగలేదని షాపు యజమాని లబో దిబో అంటున్నాడు. ఓ స్కూల్ సమీపంలో వ్యక్తి దగ్గర పండ్ల బండి పెట్టుకుని అమ్ముతూ ఉన్నాడు. ఈ క్రమంలో తోటి వ్యాపారితో చిన్న గొడవ జరిగింది. అతనితో వాదులాడుతుండగానే ఆ బండి వద్దకు కొంత మంది జనాలు వచ్చారు.. అయితే బండి వద్ద ఎవరూ లేరని గమనించి గుమ్మిగూడి దొరికిన కాడికి మామిడి పండ్లు పట్టుకెళ్లిపోయారు.

 

గొడవ సద్దుమణిగాక వచ్చి చూడగా బండి మొత్తం ఖాళీ అయిపోయింది. మరీ దరిద్రం ఏంటంటే.. మాస్కులు, హెల్మెట్లు పెట్టుకొని ఉండటంతో గుర్తించడం కష్టంగా మారింది.  ఇక పండ్లు జేబుల్లో సంచుల్లోనే కాదు.. తాము ధరించిన  హెల్మెట్‌లో పెట్టుకుని మరి వెళ్లారు.   దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: