వరంగల్ జిల్లాలో బావిలో మృతదేహాల ఘటన సంచలనం గా మారిపోయిన విషయం తెలిసిందే. ఏకంగా ఓకే బావిలోనుంచి మొదట ఒక కుటుంబానికి చెందిన నలుగురు మృతదేహాలు బయటపడ్డాయి. ఈరోజు మరో అయిదు మృతదేహాలు బయటపడటం  సంచలనంగా మారింది. ఈ ఘటన స్థానికులను సైతం తీవ్ర భయాందోళనకు గురి చేసింది. అయితే ఈ బావి నుంచి బయటపడ్డ మృతదేహాలు ఉత్తరప్రదేశ్ నుంచి వరంగల్ జిల్లాకు పాతికేళ్ల క్రితం వచ్చి ఇక్కడే నివాసం ఉంటున్న కుటుంబానికి చెందిన వారి మృతదేహాలు అని పోలీసులు గుర్తించారు. పశ్చిమ బెంగాల్ ప్రాంతానికి చెందిన మక్సుద్ ... వరంగల్ నగరంలోని కరీమాబాద్ ప్రాంతానికి 25 ఏళ్ల క్రితం వచ్చి ఇక్కడే నివాసం ఉంటున్నాడు. 

 

 కాగా మక్సుద్ కి భార్య నిషా ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు. కుమార్తెకు పెళ్ళై  ఒక కొడుకు కూడా ఉన్నారు. అయితే మక్సుద్  కుమార్తెకు ఢిల్లీకి చెందిన వ్యక్తితో వివాహం జరుగగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తో విడాకులు తీసుకున్నారు. దీంతో ప్రస్తుతం తన పుట్టింటి వద్దే ఉంటుంది యువతి. వీరంతా ప్రగతి ఇండస్ట్రియల్ ఏరియా లో... సాయి దత్త  ట్రేడర్స్ లో సంచులు కుడుతూ జీవనం సాగిస్తున్నారు. మక్సుద్  పెద్ద కుమారుడు పాలిటెక్నిక్ కాలేజీలో ఇంజనీరింగ్ డిప్లొమా చేస్తున్నాడు.. చిన్న కుమారుడు ఇంటర్ చదువుతున్నాడు. ఇక భర్తతో విడిపోయిన మక్సుద్ కూతురు కూడా ప్రస్తుతం డిగ్రీ ఫైనలియర్ చదువుతోంది. 

 

 

 

 అయితే ప్రస్తుతం లాక్ డౌన్ లో  ఉపాధి దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఈ కుటుంబం యజమానికి తమ గోడు  విన్నవించుకోగా స్పందించిన సాయి దత్త ట్రేడర్స్ లో షెడ్ లో  ఉండేందుకు తాత్కాలిక ఆశ్రయం కల్పించాడు. ఇక అక్కడి మరో గదిలో బీహార్కు చెందిన ఇద్దరు యువకులు శ్రీ రామ్ శ్యామ్ లు కూడా ఉన్నారు. అయితే ఒక్కసారిగా మసూద్ కుటుంబంతో పాటు బీహార్కు చెందిన యువకులు కూడా కనిపించక పోవడంతో అనుమానం వచ్చినా యజమాని పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలోనే తర్వాత రోజు పాడుబడిన వ్యవసాయ బావి నుంచి మసూద్ కుటుంబానికి చెందిన మృతదేహాలు తెలియాడుతు  కనిపించాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: