చంద్రబాబు వారసుడిగా లోకేష్ పార్టీ లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. పార్టీ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికైన నారా లోకేష్ చంద్రబాబు ప్రభుత్వం లో మంత్రి అయ్యారు. తన తర్వాత తన కొడుకు నారా లోకేష్ టిడిపిని నడిపించాలని చంద్రబాబు ముందు నుండి ఒక పద్ధతి ప్లానింగ్ తో లోకేష్ పొలిటికల్ కెరియర్ నీ డ్రైవ్ చేస్తున్నారు. అయితే అనుకోని విధంగా మీడియా ముందు మాట్లాడే విషయంలో గాని కొన్ని సందర్భాలలో నాలుక జారటం తో నారా లోకేష్ ని ప్రతిపక్షాలు సోషల్ మీడియాలో బాగా టార్గెట్ చేసి పలుచన చేశాయి. పాలిటిక్స్ కి లోకేష్ పనికిరాడు అన్నట్టుగా చిత్రీకరించారు. 

 

అదే సమయంలో గత సార్వత్రిక ఎన్నికల్లో మొట్టమొదటిసారి ప్రజాక్షేత్రంలో పోటీ చేసిన నారా లోకేష్ ఓడిపోవడం జరిగింది. దీంతో లోకేష్ పొలిటికల్ కెరియర్ పై దెబ్బ మీద దెబ్బ పడుతున్న తరుణంలో ఈసారి చంద్రబాబు అదిరిపోయే స్కెచ్ వేసినట్లు టిడిపి పార్టీలో టాక్. ముందుగా తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ కి ఒక పదవి కట్టబెట్టి దానిద్వారా టీడీపీ కీలక బాధ్యతలను పూర్తిగా లోకేష్ చేతిలో పెట్టాలని చంద్రబాబు ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఇందుకుగాను రాబోయే మహానాడు వేదికగా చంద్రబాబు నారా లోకేష్ కి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారట. 

 

ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అనేది లేదు. అయితే నారా లోకేష్ ప్రాధాన్యం పెంచేలా పార్టీ కార్యక్రమం ఏదైనా ఆయన కనుసన్నల్లో జరిగేలా చంద్రబాబు సమక్షంలో ఈ పదవి నారా లోకేష్ కి ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో జరగబోయే మహానాడు కార్యక్రమంలో చంద్రబాబు నారా లోకేష్ కి భారీ గిఫ్ట్ ఈ విధంగా ఇచ్చి ప్రాధాన్యం పెంచేలా, లోకేష్ పార్టీలో ఇక అన్ని కార్యక్రమాలు చేసేలా ప్లాన్ చేస్తున్నారు. మరి నారా లోకేష్ ఏ విధంగా వ్యవహరిస్తారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: