తెలుగులో ప్రింట్ మీడియా క్రమంగా ఆదరణ కోల్పోతోందని గణాంకాలు చెబుతున్నాయి. అయితే తెలుగులో ప్రధాన పత్రికలైన ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతిలతో పోల్చుకుంటే.. సాక్షి ఈ మధ్య తన కాపీల సంఖ్యలో పెరుగుదల నమోదు చేసింది. ఇప్పుడు ఈ అంశాన్ని తాను ప్రముఖంగా ప్రచారం చేసుకుంటోంది. అదే సమయంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి కాపీల్లో తగ్గుదల నమోదైందని సాక్షి ప్రచారం చేసుకుంటోంది. 


మరి ఇదే నిజమైతే.. సాక్షికి అంతగా కలసివచ్చిందేంటి.. సాక్షి నాణ్యత అమాంతం పెరిగి జనం ఆ పత్రిక కోసం క్యూలు కడుతున్నారా.. అసలు జరుగుతుందేంటి.. ఈ విషయం పరిశీలిస్తే.. జగన్ అధికారంలో ఉండటం ఆ పత్రికకు కలసివస్తుందనే చెప్పాలి. అధికార పార్టీకి చెందిన పత్రిక కాబట్టి.. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సాక్షి పత్రిక వేయించుకుంటుండవచ్చు.. అంతేకాదు.. అన్ని ప్రభుత్వ ప్రకటనలు, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారం కూడా సాక్షిని జనం చదివేందుకు ప్రోత్సహించి ఉండొచ్చు.


అంటే సాక్షి కాపీల సంఖ్య పెరుగుదలకు జగన్ ఓ బలమైన కారణంగా చెప్పుకోవాలి. అంటే సాక్షికి జగన్ ఓ బలంగా మారారన్నమాట. సాక్షికి జగన్ బలం ఓకే.. మరి సాక్షి కూడా జగన్ కు బలంగా మారుతుందా.. అంటే సమాధానం చెప్పడం కష్టమే. జగన్ కు అవసరమైన రాజకీయ మైలేజీ తీసుకురావడంలో సాక్షి మీడియా పాత్ర ఎంత అంటే చెప్పడం కష్టమే. కాకపోతే.. వైసీపీ వాయిస్ ను జనంలోకి బాగా తీసుకెళ్లే విషయంలో సాక్షి మీడియా బాగానే ఉపయోగపడుతోంది. 


సో.. జగన్ కు సాక్షి ఉపయోగపడేదానితో పోలిస్తే.. జగనే సాక్షికి ఎక్కువగా ఉపయోగపడుతున్నాడంటున్నారు మీడియా విశ్లేషకులు. ఏదేమైనా.. జగన్, సాక్షి ఈ రెండింటినీ వేరు చేసి చూడటం కూడా కష్టమేనేమో.. ఏదేమైనా అధికార పార్టీకి కరపత్రికగా మారినా సాక్షికి ఈ స్థాయి ఆదరణ లభించడం కూడా ఓ విశేషంగానే చెప్పుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: