దేశంలో కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో మార్చి 24 నుంచి లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పోలీసులు రాత్రీ.. పగలు కాపలా కాస్తూ ఎవరినీ బయటకు రాకుండా చూస్తున్నారు.  లాక్ డౌన్ ని ఎంత సీరియస్ గా పాటిస్తే కరోనా అంత మేరకు కంట్రోల్ అవుతుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ద్య కార్మికులు ఎంతో శ్రమిస్తున్నారు.  అయితే లాక్ డౌన్ సమయంలో కొంత మంది ఆకతాయిలు.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారి బండ్లు పోలీసులు సీజ్ చేసిన విషయం తెలిసిందే. వేలు, లక్షల్లో వాహనాలను సీజ్ చేశారు. కొంత మంది వాహనదారులకు పోలీసులు భారీగా జరిమానాలు విధించారు. అయినా కొంత మందిలో మాత్రం మార్పురాలేదు. 

 

హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో దాదాపు 3.25 లక్షల కేసులు నమోదు అయ్యాయి. ఈ క్రమంలో చాలామంది వాహనదారులు తమతమ వాహనాల మీద ఆశలు వదులుకున్నారు.  అయితే కరోనా కారణంగా ట్రాఫిక్ పోలీసులు సరికొత్త విధి విధానానికి పూనుకున్నారు. టి సర్కార్ వాహనదారులకు మంచి వార్త అందించింది. ఇది వాహనదారులకు ఉపశమనం కలిగించే విషయమే. జరిమానా కట్టేందుకు కోర్టుకు వెళ్లకుండా ఈ-కోర్టు ద్వారా కేసుల పరిష్కారానికి పోలీసులు సిద్ధమయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసులు పరిష్కరించాలని కోర్టును పోలీసులు కోరారు. దీనికి కోర్టు నుంచి అంగీకారం లభించింది.

 

దీంతో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ప్రవేశ పెట్టేందుకు సిద్ధమయ్యారు. కేసులు నమోదైన వారికి ముందే తేదీ, టైం స్లాట్ ఇచ్చేందుకు పోలీసులు  ఏర్పాట్లు చేస్తున్నారు.  ఒకదశలో వాహన దారులు తమ వాహనాలకు మంగళం పాడినట్లే అని భావించారు.. కానీ టి సర్కార్ తీసుకున్న నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  అయితే కరోనా పూర్తిగా అదుపులోకి రాలేదు.. ఈ సమయంలో విచ్చలవిచిడిగా వాహనాలు నడిపితే జరిమానాలు తప్పవని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: