ప్రస్తుతం నెట్టింట ఒక పిక్చర్ విపరీతంగా వైరల్ అవుతుంది. ఆ ఫోటోలో ఒక నర్సు కేవలం లో దుస్తులు మాత్రమే ధరించినట్టు స్పష్టంగా కనపడుతుంది. కాకపోతే ఆమె తనకు కరోనా వైరస్ సంక్రమించకుండా పర్సనల్ ప్రొటెక్టీవ్ ఎక్విప్మెంట్(PPE) ధరించి ఉంది. ఈ పారదర్శకమైన PPE ద్వారా ఆమె లో దుస్తులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ఫోటో వైరల్ కావడంతో ఆ ఆసుపత్రి యాజమాన్యం ఆమెపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. కానీ ఆమె తోటి పనిచేసే ఇతర నర్సులు ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు. ఆమెకు సరైన బట్టలు దొరకకపోవడంతో ఈ విధంగా లోదుస్తులు వేసుకుందని వాళ్ళు చెప్పుకొస్తున్నారు. 


పూర్తి వివరాలు తెలుసుకుంటే... రష్యా దేశంలోని టుల నగరంలోని ఒక ఆసుపత్రిలోని కోవిడ్ 19 వార్డులో పనిచేస్తున్న నర్సు లోదుస్తులను మాత్రమే ధరించి పైన పారదర్శకమైన PPE ని తొడుక్కుంది. దాంతో ఆ వార్డులో ఉన్న మేల్ పేషెంట్లు కాస్త ఇబ్బందికి గురయ్యామని చెప్తున్నారు. యూనిఫాం కోడ్ పాటించకుండా మగ కరోనా బాధితులకు ఇబ్బంది కలిగించిన ఈ నర్సుపై చర్యలు తీసుకుంటామని ఆ ఆసుపత్రి మీడియాకు తెలిపింది. 


అయితే ఆసుపత్రి హెడ్ అనస్తాసియా వాసిలీవా మాట్లాడుతూ... ఆమె కావాలనే ఇలా తన శరీరాన్ని ఎందుకు చూపించుకుంటుంది? ఒకవేళ ఆమె మా సహాయం కోరితే నేను తప్పకుండా ముందుకు వస్తాం. PPE కిట్స్ పారదర్శకంగా తయారుచేసి నర్సులకు అందించిన ఆసుపత్రి యాజమాన్యానిది తప్పు కానీ తనది కాదు. ఈ ఫోటోలో ఆమె ప్లాస్టిక్ సూట్ ధరించినట్లు కనిపిస్తుంది. ఈ ఫోటోలో ఆమె లోదుస్తులను గమనించకుండా... ఆమెకు ఎటువంటి పిపిఈ గౌన్ ఇచ్చారో మనం గమనించాలి. అస్సలు పిపిఈ అనేది పారదర్శకంగా ఉండకూడదు. వేరొక వస్త్రంతో అది తయారు చేయాల్సి ఉంది', అని ఆమె నర్సు కు మద్దతు తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: