గ‌ర్భ నిరోధానికి నేడు అనేక పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. పురుషుల కండోమ్స్, స్త్రీల కండోమ్స్‌తోపాటు మాత్రలు, ఇంజెక్లు, ఆ తర్వాత స్టెరిలైజేషన్లు ఇలా అనేకం అందుబాటులోకి వ‌చ్చాయి. అయితే.. వీటిలో వేటిని ఎంత మంది వాడుతారో, ఏవీ వాడకుండా ఎంత మంది పిల్లలను కంటారో? చెప్పడానికి కేంద్ర ప్రభుత్వం వద్ద కూడా అంచనాలు ఉంటాయి. ఈ అంచనాలకు తగ్గట్లుగా కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ 35 లక్షల స్టెరిలైజేషన్లు, 57 లక్షల ఇంట్రా–యుటరిన్‌ గర్భనిరోధక పరికరాలు, 18 లక్షల ఇంజెక్షన్లు, 41 కోట్ల సైకిళ్లకు సరిపోయే గర్భ నిరోధక మాత్రలు, 25 లక్షల అత్యవసర గర్బనిరోధక మాత్రలు, 32 కోట్ల కండోమ్స్‌ను మెడికల్‌ షాపుల ద్వారా కేంద్రం అందుబాటులో ఉంచింది.

 

ప్ర‌భుత్వం ఇన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నా.. అనవసరంగా వచ్చే గ‌ర్భావకాశాలు కూడా భారత్‌లో ఎక్కువే అందుకని ఈ ఏడాది కూడా 14.5 లక్షల అబార్షన్లు జరుగుతాయని, వాటిలో 8,34,042 సురక్షితంగాని నాటువైద్యం పద్ధతిలో అబార్షన్లు జరుగుతాయని, అయినప్పటికీ 6,79,864 ప్రసవాలు సంభవిస్తాయని ఆరోగ్య శాఖ అంచనా వేసింది. ప్రస్తుతం క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. ఈ‌ కారణంగా దేశ వ్యాప్తంగా అవాంఛిత గర్భాల‌ సంఖ్య 23 లక్షలకు చేరుకుంటుందని, వాటిలో సురక్షితంగానీ అబార్షన్ల సంఖ్య 10 లక్షలకు చేరుకుంటుందని ఆరోగ్య శాఖ అంచనాలు తెలియజేస్తున్నాయి. ప్రసవాల సంఖ్య 8,44,488 చేరుకోవచ్చని ఆరోగ్య శాఖ చెబుతోంది.

 

అవాంఛిత గర్భాలను తీసివేయక పోయినట్లయితే ప్రసవాల సంఖ్య మరింతగా పెరగుతుంది. సురక్షితంగానీ అబార్షన్ల వల్ల పలు రకాల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదంతోపాటు చనిపోయే ప్రమాదం కూడా ఉంటుందని వైద్యులు హెచ్చ‌రిస్తున్నారు. ఈ ఇలాంటి ప‌రిస్థితుల్లో మ‌రింత జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని జంట‌ల‌కు సూచిస్తున్నారు. ఏమాత్రం నిర్ల‌క్ష్యంగా ఉన్నా.. అరోగ్యంపై తీవ్ర ప్ర‌భావం చూపుతుంద‌ని అంటున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: