డాక్టర్ సుధాకర్‌ వ్యవహారంపై హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. విశాఖ పోలీసులపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని సీబీఐను ఆదేశించింది. 8 వారాల్లోగా విచారణ పూర్తిచేసి నివేదిక ఇవ్వాలని ఆదేశాల్లో తెలిపింది. అయితే హైకోర్టు తీర్పుపై టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సుధాకర్‌కు న్యాయం జరిగిందని, న్యాయ వ్యవస్థ ద్వారా గెలిచామాని, ప్రతి విషయంలోనూ వైసీపీ ప్రభుత్వానికి కోర్టు మొట్టికాయలే వేస్తుందని విమర్శలు టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.

 

ఇదే సమయంలో హైకోర్టు తీర్పుని వైసీపీ నేతలు కూడా స్వాగతిస్తున్నారు. సీబీఐ విచారణ మంచిదే అని, చంద్రబాబు డైరెక్షన్‌లో డాక్టర్ సుధాకర్ నడుచుకున్నారని వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. పైగా టీడీపీ నేతలే డాక్టర్ సుధాకర్‌కు గడ్డం, గుండు గీయించారని, సుధాకర్‌ కేసులో చంద్రబాబును విచారించాలని, అలాగే ఆయన కాల్ లిస్ట్ బయటపెట్టాలని వైసీపీ ఎంపీ నందిగం సురేష్ డిమాండ్ చేస్తున్నారు.

 

అంటే వైసీపీ ఎంపీ చెప్పే దానిబట్టి చూస్తే సుధాకర్ వెనుక బాబు పాత్ర ఉందని స్ట్రాంగ్ గా నమ్ముతున్నారు. ఆయన డైరక్షన్ లోనే సుధాకర్ అలా వ్యవహరించారని అనుకుంటున్నారు. అందుకే చంద్రబాబుని కూడా విచారించాలని, కాల్ లిస్ట్ కూడా బయటపెట్టాలని అడుగుతున్నారు. అయితే ఇక్కడ సీబీఐ విచారణ జరిగేప్పుడు సురేశ్ చెప్పిన అంశాలు పరిగణలోకి వస్తాయా? లేదా? అనేది చూడాలి. ఒకవేళ ఆ కోణంలో కూడా విచారణ జరిగితే, సుధాకర్ విషయంలో బాబు ప్రమేయం ఉన్నట్లు తేలితే ఇబ్బందులు తప్పవు.

 

అలా అని ఇందులో ప్రభుత్వ ఒత్తిడి కూడా ఉందని తేలితే, పరిస్థితులు ఎలా ఉంటాయనేది మరో అంశంగా ఉంది. పైగా ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో సుధాకర్ గాయాల ఊసే లేదని ధర్మాసనం చెబుతోంది. అలాగే ప్రభుత్వ నివేదికను నమ్మడం లేదని... దీని వెనుక భారీ కుట్ర ఉందని భావిస్తున్నామని అంటుంది. మరి దీని బట్టి చూసుకుంటే వైసీపీ ప్రభుత్వానికి కూడా కాస్త ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముందని తెలుస్తోంది. మరి చూడాలి అసలు సీబీఐ విచారణలో ఏ విషయాలు వెలుగులోకి వస్తాయో?

మరింత సమాచారం తెలుసుకోండి: