జగన్ అధికారంలోకి రావడానికి ఎక్కువగా ఉపయోగపడిన అంశం ఏదైనా ఉందంటే అది నవరత్నాలే. ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలం అందించాలనే ఉద్దేశంతో జగన్ నవరత్నాల పేరిట ప్రజలకు హామీ ఇచ్చి ఎన్నికల్లో గెలిచారు. అయితే ఎన్నికల్లో గెలిచాక నవరత్నాలు అమలు దిశగా ముందుకెళుతున్నారు.

 

కానీ ఈ నవరత్నాలు అమలు సాధ్యం అయ్యే పని కాదని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ అంటున్నారు. ఆదాయ మార్గాలు పెంచుకోకుండా సంక్షేమ పథకాల వల్ల అప్పులే మిగులుతాయని, నవరత్నాల వల్ల రాష్ట్రానికి వచ్చే మేలు ఏమీ లేదని, ఇదంతా ఓట్లు రాబట్టుకోడానికి చేసే ప్రయత్నం అని మాట్లాడుతున్నారు. ఇక పనిలో పనిగా ఓ చిన్న డైలాగ్ కూడా వేశారు. నిద్రపోతున్నా తాము కలలోకి రావాలనే దోరణిలో జగన్ ప్రభుత్వం ఉందని అన్నారు.

 

అయితే నవరత్నాలు అమలు సాధ్యమయ్యే పని కాదని మాధవ్ చేసే వ్యాఖ్యల్లో ఎలాంటి అర్ధం లేదని తెలుస్తోంది. ఎందుకంటే జగన్ అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సర కాలంలో ఇంతవరకు ఏ సీఎం చేయని విధంగా సంక్షేమ పథకాలు అందించారు. అర్హులైన ప్రతిఒక్కరు జగన్ పథకం ద్వారా లబ్దిపొందారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఆర్ధిక పరిస్థితులు బాగోకపోయినా సరే, అనుకున్న టైమ్‌కు పథకాలు అమలు చేశారు.

 

కరోనా ప్రభావం, లాక్ డౌన్ ఉన్నాసరే పలు పథకాలు ప్రజలకు అందించారు. అసలు మొత్తం మీద చూసుకుంటే నవరత్నాల్లో 80 శాతం హామీలని ఈ సంవత్సరం లోపే అమలు చేసేశారు. మరి ఇలా నవరత్నాలు అమలు చేసినా.. బీజేపీ ఎమ్మెల్సీ మాత్రం హామీలు అమలు అసాధ్యం అనడం కాస్త హాస్యాస్పదంగానే ఉంది. పైగా జగన్ ప్రభుత్వం ఆదాయం వచ్చే ఏ మార్గాన్ని కూడా వదిలిపెట్టడం లేదు. అందుకే నిరుపయోగంగా పడి ఉన్న భూములని సైతం అభివృద్ధి చేసి, అమ్మి ఆ సొమ్ముని నవరత్నాల అమలు కోసం కేటాయించాలని అనుకుంటుంది. మొత్తానికైతే నవరత్నాలు అమలు చేయడంలో జగన్ సక్సెస్ అయ్యారని గట్టిగా చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: