కరెంట్ బిల్లులు విషయంపై ఏపీ రాజకీయాలు హాట్ హాట్ గా నడుస్తున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ నేపథ్యంలో మార్చి నెల కరెంట్ రీడింగ్ తీయకుండా, గత ఫిబ్రవరిలో ఎంత బిల్లు వచ్చిందో అంతే బిల్లునే ఆన్ లైన్‌లో కట్టమని వైసీపీ ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే తెలిసిన వారు ఆన్‌లైన్‌లో కట్టారు..తెలియని వారు అలాగే వదిలేశారు. ఇక ఏప్రిల్ నెలకొచ్చి రీడింగ్ తీసేప్పుడు రెండు నెలలు కలిపి బిల్లులు తీశారు. దీంతో యూనిట్ల వారీగా ఉన్న స్లాబులు రేట్లు మారిపోవడంతో వినియోగదారులకు కరెంట్ బిల్లుల మోత మోగింది.

 

ఇక దీనిపై చాలామంది వినియోగదారులు సోషల్ మీడియా వేదికగా నిరసన వ్యక్తం చేశారు. లాక్ డౌన్ సమయంలో ఆదాయం లేకుండా ఇబ్బందులు పడుతుంటే ఇంత కరెంట్ బిల్లు వేసి, కట్టమంటే ఎలా కడతామని ప్రశ్నిస్తున్నారు. అలాగే దీనిపై టీడీపీ నేతలు కూడా స్పందిస్తూ..మూడు నెలల కరెంట్ బిల్లులని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జగన్ నిర్లక్ష్య ధోరణికి ఇది నిదర్శనమని, కరెంట్ గురించి జగన్‌కు అస్సలు అవగాహన లేదని మండిపడుతున్నారు.

 

అయితే కరెంట్ బిల్లులపై టీడీపీ రాద్ధాంతం చేస్తున్నారని, వినియోగదారులు ఎంత వాడితే అంతే బిల్లు వచ్చిందని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబుపై విజయసాయిరెడ్డి విమర్శలు చేశారు. చంద్రబాబు హయాంలో లక్ష కోట్ల ప్రజాధనాన్ని ప్రైవేటు విద్యుత్తు సంస్థలకు దోచిపెట్టడానికి ఒప్పందాలు చేసుకున్నారని ఫైర్ అయ్యారు. ఇక ఈ విషయంపై టీడీపీ కార్యకర్తలు కూడా సెటైర్లు వేస్తున్నారు.

 

చంద్రబాబు హయాంలో విద్యుత్ రేట్లు ఒక్క పైసా కూడా పెంచలేదని, అలాగే మిగులు విద్యుత్ సాధించి 24 గంటల కరెంట్ ఇచ్చిన ఘనత చంద్రబాబుదని, కానీ ఇప్పుడు కరెంట్ కోతలు, విద్యుత్ బిల్లుల మోతలు జరుగుతున్నాయని అంటున్నారు. ఆఖరికి విజయసాయి కూడా చంద్రబాబు హయాంలో విద్యుత్ రేట్లు పెంపు జరిగినట్లు చెప్పలేదని, ప్రైవేట్ సంస్థలకు దోచిపెట్టినట్లు విమర్శలు చేశారని చెబుతున్నారు. ప్రైవేట్ సంస్థలకు దోచిపెడితే విచారణ చేసి నిజనిజాలు తేల్చుకోవచ్చు కదా అని విజయసాయిని ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా చంద్రబాబు హయాంలో మాత్రం విద్యుత్ బిల్లుల పెంపు, కరెంట్ కోతలు మాత్రం లేవని గుర్తుచేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: