ఏపీ మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిటిషన్ మీద విచారణ ఈ నెల 9బ్ తేదీతో ముగిసింది. ఈ కేసులో తీర్పుని హై కోర్టు రిజర్వ్ లో ఉంచింది. ఈ కేసును ద్వి సభ్య బెంచ్ విచారించింది. మరి ఈ కేసులో తీర్పు ఎపుడు వస్తుందో తెలియదు కానీ  సర్వత్రా ఉత్కంఠగా ఉంది.

 

ఇదిలా ఉండగా ఏపీ సర్కార్ కి వరసగా హైకోర్టు నుంచి షాకులే వస్తున్నాయి. గత ఏడాదిగా వైసీపీ సర్కార్ ఏర్పడిన తరువాత మొత్తం 64 కేసుల్లో ప్రభుత్వనికి వ్యతిరేకంగా హైకోర్టు తీర్పు వచ్చింది. ఇది ఓ విధంగా రికార్డు అంటున్నారు. అందులోనూ జగన్ సర్కార్ అఖండ మెజారిటీతో నెగ్గిన ప్రభుత్వం. 

 

ఒక ప్రజా ప్రభుత్వం మీద ఇన్ని కేసులు పడడం కూడా ఇక్కడ‌ రికార్డే. అంటే దాదాపుగా ప్రభుత్వం తీసుకున్న ప్రతీ నిర్ణయం మీద పిటిషనర్లు కోర్టుకు వెళ్లారన్న మాట. ఇక కోర్టు నిబంధలపరంగా చూస్తూ ప్రభుత్వ జీవోలు అనేకం కొట్టివేసింది. దీన్ని టీడీపీ నేతలు వైసీపీ సర్కార్ కి చెంపపెట్టుగా చెబుతున్నారు.

 

అయితే కోర్టు తీర్పులలో సాంకేతిక అంశాలు అనేకం ఉంటాయి. ప్రభుత్వం తొందరపాటులోనో, తడబాటుతోనే, పొరపాటులోనే చేసిన నిర్ణయాల వల్ల కూడా తీర్పులు వ్యతిరేకంగా వస్తాయి. ఇక ప్రభుత్వం తరఫున వాదనలు బలంగా లేకపోయినా తీర్పులు వస్తాయి. ఇవన్నీ ఇలా ఉంటే శుక్రవారం ఒక్క రోజే మూడు కేసుల్లో వైసీపీ సర్కార్ కి గట్టి ఝలక్ తగిలింది. మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ఎత్తివేయడమే కాకుండా ఆయనకు జీతలు చెల్లించాల్ని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

 

అదే విధంగా మత్తు డాక్టర్ సుధాకర్ విషయంలో కూడా కోర్టు ప్రభుత్వాన్ని తప్పుపట్టింది. ఏకంగా సీబీఐ విచారణకే ఈ కేసుని అప్పగించింది. ఇక మూడవది పంచాయతి భవనాల రంగుల విషయంలో ప్రభుత్వాన్ని గట్టిగా మందలించింది. ఇలా కోర్టు తీర్పులు వరసగా ఒకే రోజు మూడు వ్యతిరేకం రావడం వైసీపీలో చర్చ సాగుతొంది. మరో వైపు నిమ్మగడ్డ తొలగింపు వ్యవహారం మీద కోర్టు తీర్పు ఎలా వస్తుందో అన్న టెన్షన్ కూడా అధికార వర్గాల్లో ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

 

మరింత సమాచారం తెలుసుకోండి: