కరోనా వైరస్ సృష్టిస్తున్న విధ్వంసం ఇప్పుడు అప్పుడే ఆగి పోయేలా కనిపించడం లేదు. రోజు రోజుకి ప్రపంచ వ్యాప్తంగా వైరస్ విస్తరిస్తూనే ఉంది. పాజిటివ్ కేసులు లక్షల్లో నమోదు అవుతుండగా మృతుల సంఖ్య కూడా రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో ప్రపంచవ్యాప్తంగా లక్ష మందికి ఈ వైరస్ సోకినట్లు లెక్కలు చెబుతున్నాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా 50 లక్షలకు పైగా కరోనా వైరస్ బాధితులు సంఖ్య పెరిగింది. యూరప్ మరియు అమెరికా దేశాల్లో పరిస్థితి మరీ చాలా విషమంగా ఉంది. ఒక్క రోజులోనే కొత్త కేసుల సంఖ్య లక్షకు పైగా ఈ ప్రాంతాలలో దాటింది. ఇదిలా ఉండగా కరోనా వైరస్ వచ్చిన వారిలో ఇప్పటివరకు 20 లక్షల మంది కోలకున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ తెలియజేశారు.

 

అయితే ఇటీవల ఒక్కసారిగా ఒక్కరోజులో లక్ష కేసులు నమోదు కావడంతో ఆయన ఆందోళన చెందారు. ఇదిలా ఉంటే ఒక్క అమెరికాలోనే కరోనా వైరస్ వ్యాధి బారిన పడిన వారి సంఖ్య 16 లక్షలకు దాటడం గమనార్హం. బ్రెజిల్ దేశంలో కూడా మొత్తం కేసుల సంఖ్య 36 వేలు దాటగా, రష్యాలో కొత్తగా 8,849 కేసులు వచ్చాయి. ఇదిలా ఉండగా చైనా దేశంలో మళ్లీ ఈ వైరస్ కొన్ని ప్రాంతాలలో బలపడుతోందని వెంటనే చైనా ప్రభుత్వం ఆ ప్రాంతాలలో లాక్ డౌన్ ని మళ్లీ విధిస్తున్నారు. 

 

ఇటువంటి సమయంలో వైద్య నిపుణులు కరోనా వైరస్ మీద మరొక అంశం బయటపెట్టారు. అదేమిటంటే ఇదివరకు జ్వరం, పొడి దగ్గు మరియు జలుబు ఎక్కువగా ఉంటే కరోనా వైరస్ లక్షణాలు గా గుర్తించడం జరిగింది. అయితే ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న వైరస్ కి ఎటువంటి లక్షణాలు లేకుండా ఒకరి నుండి ఒకరికి సోకుతుందని అందువల్లే ప్రపంచవ్యాప్తంగా కేసుల సంఖ్య పెరుగుతున్నాయని వైద్య నిపుణులు అంటున్నారు. దీంతో ఇప్పుడు ఎవరికి కరోనా వైరస్ ఉందొ ఎవరికీ లేదో అన్న దాని గురించి క్లారిటీ లేకుండా పోయింది అని తెలిపారు. పూర్తిగా ఊపిరితిత్తులపై ప్రభావం చూపే టైం కి అప్పుడు బయటపడుతుందని ఈ వైరస్ ప్రస్తుతం చైనాలో ఉందని చెప్పుకొచ్చారు. ఈ వార్త విని ప్రజలు ఇది వరకు దగ్గితే కరోనా ఉందేమో అని అనుమానించి జాగ్రత్త పడేవాళ్ళం, ఇప్పుడు ఆ ఛాన్స్ కూడా లేకుండా పోయిందని బాధపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: