ఉమ్‌పన్‌ తుపాన్‌తో అతలాకుతలమైన బెంగాల్‌, ఒడిషా రాష్ట్రాలకు కేంద్రం అండగా నిలుస్తుందన్నారు ప్రధాని మోడీ. కేంద్రమంత్రులు, బెంగాల్ సీఎం మమతతో కలిసి ఏరియల్ సర్వే ద్వారా నష్టాన్ని పరిశీలించిన పీఎం.. తాత్కాలిక సాయం కింద వెయ్యికోట్ల రూపాయలు ప్రకటించారు. పూర్తిస్థాయి నష్టం వివరాలు తెలుసుకున్న తర్వాత...మరింత సాయం చేస్తామన్నారు. మరోవైపు.. ఒడిషాలోనూ... పీఎం మోడీ.. ఏరియల్ రివ్యూ చేశారు.

 

తుపాను విధ్వంసంతో తీవ్రంగా నష్టపోయిన బెంగాల్, ఒడిషాల్లో ప్రధాని మోడీ పర్యటించారు. ముందుగా కోల్‌కతా చేరుకున్న పీఎం మోడీకీ.. బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్‌ఖర్, ముఖ్యమంత్రిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మమతను పలకరించిన మోదీ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో .. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో మోడీ, మమత, గవర్నర్, కేంద్రమంత్రులు.. ఏరియల్ రివ్యూ చేశారు. మ్యాప్ చూస్తూ నష్టం వివరాలను ... మంత్రులు, అధికారులను అడిగి తెలుసుకున్నారు.

 

ఉమ్‌పన్‌ తుపాను మిగిల్చిన విషాదంతో విలవిలలాడుతున్న పశ్చిమబెంగాల్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెయ్యి కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించారు.  కష్టకాలంలో బెంగాల్ ప్రజలకు అన్ని విధాలా అండగా ఉంటామన్నారు. తాత్కాలిక సాయం కింద వెయ్యి కోట్లు ప్రకటించిన ప్రధాని.. నష్టానికి సంబంధించి పూర్తి వివరాలు తెలిశాక మరింత సాయం చేస్తామన్నారు.

 

మరోవైపు కనీవినీ ఎరుగని విపత్తుతో తీవ్రంగా నష్టపోయామని మమత ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్‌పన్ తుపానును జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

 

బెంగాల్‌ నుంచి ఒడిషా చేరుకున్న ప్రధానికి.. ఎయిర్‌పోర్టులో రాష్ట్రముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ,గవర్నర్, ఇతర అధికారులు స్వాగతం పలికారు. అనంతరం మోడీ... నవీన్ పట్నాయక్‌తో కలిసి ఏరియల్ రివ్యూ తీశారు. మొత్తానికి ఉమ్ పన్ తుఫాన్ పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించింది. ఇపుడు ఆ రాష్ట్రాల్లో ఏరియల్ సర్వే నిర్వహించిన ప్రధాని నష్టాన్ని పూడ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: