జగన్ తండ్రి వైఎస్సార్ వారసుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆయన 2009 వరకూ తండ్రి చాటు బిడ్డడే. కానీ ఎపుడైతే వైఎస్సార్ హఠాన్మరణం చెందారో నాటి నుంచి ఎదుగుతూ ఇలా ఎవరెస్ట్ శిఖరంగా నిలిచారు. వైఎస్సార్ కంటే రెట్టింపు జనాదరణను సొంతం చేసుకున్నారు. కొన్ని నిర్ణయాలు తీసుకొవడంలో ఆయన సాహసం తెలుస్తుంది.

 

తాను దూకుడు నిర్ణయాల వల్ల ఇబ్బందులు పడ్డా వెనక్కి తగ్గని నైజం జగన్ ది. ఇక పేదవారికి సాయం చేయడంలో ఎపుడూ జగన్ పెద్ద చేయితో వస్తారు, పెద్ద మనసు చూపిస్తారు. జగన్ ఆ విషయంలో తానే చెప్పుకున్నట్లుగా తండ్రి కన్నా రెండు అడుగులు ముందుంటారు. ఇక జగన్ మాటకు కట్టుబడి ఉంటారు. ఆయన ఎన్నికల్లో ఇచ్చిన ప్రతీ హామీను ఏడాదిలోగానే నెరవేర్చడం విశేషం.

 

నవరత్నాలు పట్టాలు ఎక్కించిన జగన్ తాను చెప్పినవీ చెప్పనివీ కలిపి ఎన్నో కార్యక్రమాలు ఇప్పటికే ఏపీలో చేపట్టారు. అదే విధంగా దేశంలో ఎక్కడా లేని విధంగా 44 సంక్షేమ కార్యక్రమాలు ఏపీలో అమలవుతున్నాయి. ఇది కూడా ఒక  రికార్డుగా చెప్పుకోవాలి. ఓ వైపు చూస్తే రాష్ట్ర ఖజానా వెక్కిరిస్తోంది. ఖాళీ చేసి టీడీపీ సర్కార్ వెళ్ళిపోయింది.

 

ఇక విమర్శలు చేయడానికి నానా యాగీ చేయడానికి బలమైన పార్టీగా టీడీపీ ఉంది. జనసేన, బీజేపీ వంటి పార్టీలు కూడా జగన్ కి వ్యతిరేకంగానే ఉన్నాయి. ఏపీలో ఎక్కడా లేని రాజకీయ విచిత్రం కనిపిస్తుంది. ఎక్కడైనా ఒక అభిప్రాయంతో వామపక్షాలు, బీజేపీ ఉండవు, కానీ జగన్ విషయంలో మాత్రం రెండు పార్టీలు కలసిపోయాయనే చెప్పాలి. ఇలా విపక్ష రాజకీయాన్ని ఆయన ఎదుర్కొని ముందుకు సాగుతున్నారు.

 

ఇలా జగన్ ఎదురులేని నాయకునిగా ఉండడానికి, ధైర్యంగా ముందుకు అడుగు వేయడానికి ఒకే ఒక కారణం జగన్ కి తరగని  జనం ఆదరణ. ఆయన బంపర్ మెజారిటీతో గత ఏడాది ఇదే రోజున అధికారంలోకి వచ్చారు. జనం తనని ఇంతలా ఆదరించారు కాబట్టి ఎవరు ఎలా ఉన్నా, ఎటువంటి  రాజకీయాలు చేసినా కూడా తాను అడుగు వెనక్కు వేయకూడని జగన్ భావిస్తున్నారు. అందుకే ఆయన ఏ ఒక్క కార్యక్రమాన్ని ఆపకుండా ముందుకు సాగుతున్నారు.

 

మొత్తం మీద గొప్ప జడ్జిమెంట్ డేగా మే 23ని చెప్పుకోవాలి. జగన్ జగజ్జేతగా అధికారంలోకి వచ్చిన రోజును వైసీపీ శ్రేణులతో పాటు రాజకీయాల్లో మార్పు కోరుకునేవారంతా కూడా ఆనందిస్తారు. ఆహ్వానిస్తారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: