ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నా లోకేష్ కు పార్టీలోనూ, ప్రజల్లోనూ అనుకున్నంతగా పేరుప్రఖ్యాతులు రావడం లేదనే బాధలో టీడీపీ అధినేత చంద్రబాబు చాలాకాలంగా ఉన్నారు. ప్రస్తుతం చంద్రబాబు వయసు రీత్యా చూసుకున్నా, ఎంతో కాలం రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండే పరిస్థితి కనిపించడం లేదు. మరికొద్ది సంవత్సరాల్లో అయినా, పూర్తిగా రాజకీయాలకు విరామం ప్రకటించాల్సిన పరిస్థితి చంద్రబాబుది. అందుకే ఎప్పటి నుంచో లోకేష్ ను రాజకీయంగా తిరుగులేని నాయకుడిగా తీర్చిదిద్దాలని చంద్రబాబు ప్లాన్ చేస్తూ, ఆయనకు ఇప్పటికే రకరకాల ట్రైనింగ్ లు ఇప్పించారు. అయినా పెద్దగా మార్పు అయితే కనిపించలేదు. అదీ కాకుండా పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయే ప్రతినాయకుడు లోకేష్ ను టార్గెట్ చేసుకుని విమర్శలు చేయడం, లోకేష్ కారణంగానే తెలుగుదేశం పార్టీకి ఈ దుస్థితి పట్టిందని విమర్శలు చేయడం వంటివి చంద్రబాబును బాగా బాధిస్తున్నాయి.

 

IHG's son ...


 పార్టీ సీనియర్ నాయకులు కూడా లోకేష్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. ముందు ముందు వీరి సహకారం కూడా లోకేష్ కు అంతగా ఉండే అవకాశం కూడా కనిపించడం లేదు. తాను పార్టీ అధ్యక్షుడిగా ఉండగానే లోకేష్ పనితీరుపై పార్టీ నాయకులు బహిరంగంగానే అసంతృప్త వ్యక్తం చేస్తుండడంతో చంద్రబాబు తీవ్రంగా వేదనకు గురవుతున్నట్టు తెలుస్తోంది. పార్టీలో లోకేష్ ప్రాధాన్యం పెంచకపోతే ముందు ముందు ఇబ్బందులు తప్పకపోవచ్చు అనే ఉద్దేశంతో ఆయనకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని కట్టబెట్టేందుకు ఇప్పటికే చంద్రబాబు ప్లాన్ చేశారు. ఎప్పడూ లేని విధంగా పార్టీలో ఈ పోస్ట్ ను సృష్టించబోతున్నారు. 

 

IHG

 

దీంతో పాటు లోకేష్ కోసం  బాగా వాక్చాతుర్యం ఉన్న సమర్ధులైన యువ నాయకులతో ఒక టీమ్ ను ఏర్పాటు చేసి, లోకేష్ కు అన్ని విషయాల్లోనూ అండదండలు అందించే విధంగా మహానాడులో ప్రకటించాలని చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే అటువంటి అర్హతలు ఉన్న నాయకులను గుర్తించినట్లు సమాచారం. వీరందరితో ఒక టీమ్ ను  ఏర్పాటు చేసి మహానాడు లో ప్రకటించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.త్వరలోనే లోకేష్ తన సైన్యంతో రాజకీయ ప్రత్యర్థులపై దండెత్తే అవకాశం కనిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: