ఏదో ఒక అంశంపై టీఆర్ఎస్ నాయకులపై విరుచుకుపడేందుకు రెడీ గా ఉంటారు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. ఇప్పటికే సొంత పార్టీ నాయకుల గ్రూపు రాజకీయాలతో సతమతం అవుతూనే, మరోవైపు తమ రాజకీయ బద్ధశత్రువులైనా 
తెలంగాణ సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఈ మధ్యనే కేసీఆర్ ఫామ్ హౌస్ సమీపంలో అనుమతి లేకుండా డ్రోన్ కెమెరా ద్వారా కేటీఆర్ ఫామ్ హౌస్ చేయిత్రీకరించిన కేసులో రేవంత్ నిందితుడిగా ఉండటమే కాకుండా, జైలు జీవితాన్ని కూడా అనుభవించి వచ్చారు. ఆ తర్వాత కొద్ది రోజులు సైలెంట్ గానే ఉన్నా, ఇప్పుడు మాత్రం కేసీఆర్ ను టార్గెట్ చేసుకుని తీవ్రస్థాయిలో విమర్శలు మొదలుపెట్టారు. 

 

IHG's Daughter Kavita Want To 'Comeback' In ...


ముఖ్యంగా నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణలో ఇతర పార్టీలకు చెందిన నాయకులు అందరినీ భయపెట్టి బలవంతంగా టిఆర్ఎస్ లో చేర్చుకుంటున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. అంతేకాకుండా దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ ను కలిసి ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా కేసీఆర్ తన కుమార్తె కవిత గెలుపు కోసం ప్రజాస్వామ్యం అపహాస్యం చేస్తున్నారని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ రేవంత్ మండిపడ్డారు.


 కవితను ఏదో ఒకరకంగా ఎమ్మెల్సీ చేయాలని కెసిఆర్ చూస్తున్నారని, నిజామాబాద్ లో ప్రజాస్వామ్యాన్ని బతికించాలని కోరుతూ తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి, విప్ గంప గోవర్ధన్ పై రేవంత్ రెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు. రేవంత్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ కూడా అదే స్థాయిలో స్పందించింది. రేవంత్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, ఆయన తన ఉనికిని చాటి చెప్పుకుఎందుకే ఈ విధంగా వ్యవహరిస్తూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ టీఆర్ఎస్ కు చెందిన పలువురు రేవంత్ పై విమర్శలు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: