టాలీవుడ్.. అంటే తెలుగు సినీపరిశ్రమ అంతా హైదరాబాద్ కేంద్రంగానే సాగుతోంది. టాలీవుడ్ లో నూటికి 70 నుంచి 80 శాతం ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వారే కీలకంగాఉన్నా.. వారు సొంత రాష్ట్రంవైపు చూడటం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి ఆరేళ్లు దాటి పోయినా ఇంకా టాలీవుడ్ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ ను పెద్దగా పట్టించుకోవడం లేదు. హైదరాబాద్ చుట్టుపక్కలే అన్ని సౌకర్యాలు ఉండటం ఓ కారణం కావచ్చు.

 

 

విభజిత ఏపీ మొదటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు టాలీవుడ్ తో మంచి పరిచయాలు ఉన్నా.. సినీపరిశ్రమను ఏపీ వైపు వచ్చేలా ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారు. కానీ ఇప్పుడు జగన్ సర్కారు టాలీవుడ్ ను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా

తాజాగా ఓ జీవో విడుదల చేసింది. దీని ప్రకారం ఏపీలో ఉచితంగా షూటింగ్ లు చేసుకోవచ్చు. ఇందుకోసం కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు,ఇతర ప్రదేశాలు, టూరిస్టు ప్రాంతాలు ఇలా వివిధ జోన్ లుగా వర్గీకరించింది. ఆయా చోట్ల షూటింగ్ లను ఉచితంగా చేసుకోవచ్చు.

 

 

అయితే ఏపీలో షూటింగ్ చేసుకోవాలనుకునేవారుప కాషన్ డిపాజిట్ మాత్రం చెల్లించవలవసి ఉంటుంది. షూటింగ్ పూర్తి అయ్యాక ఆ డిపాజిట్ ను అదికారులు తిరిగి ఇచ్చివేస్తారు. కార్పొరేషన్ ఏరియాలలో అయితే రోజుకు పదిహనువేల రూపాయల చొప్పున, ఆ తర్వాత మున్సిపాల్టీలు, ఇతర ప్రదేశాలలో పదివేలు, ఐదువేలు చొప్పున కాషన్ డిపాజిట్ చెల్లిస్తే ఉచితంగానే షూటింగ్ చేసుకోవచ్చు.

 

 

ఈ ఉత్తర్వులు లాక్ డౌన్ ముగిసిన తర్వాత నుంచి అమల్లోకి వస్తాయి. షూటింగ్ లకు అనుమతి ఇచ్చినప్పుడు ఈ నిబంధనలు వర్తిస్తాయి. వాస్తవానికి ఏపీలో వైజాగ్ వంటి నగరాల్లో సినీ చిత్రీకరణకు మంచి అవకాశాలు ఉన్నాయి. మంచి పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. మరి ఈ చర్యలు ఎంతవరకూ ఉపయోగపడతాయో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: