త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి దివంగ‌త జ‌య‌ల‌లిత ఎప్పుడూ సంచ‌ల‌నంగానే ఉండేవారు. ఆమె జీవించి ఉన్న‌ప్పుడు ఆ త‌ర్వాత కూడా ఆమె రాజ‌కీయ జీవితం అయినా.. ఆమె వ్య‌క్తిగ‌త జీవితం అయినా ఎప్పుడు సంచ‌ల‌నాత్మ‌కంగానే వార్త‌ల్లో ఉండేవి. ఇక జ‌య‌ల‌లిత త‌మిళ‌నాడులో వ‌రుస‌గా రెండోసారి సీఎంగా గెలిచి స‌రికొత్త రికార్డు క్రియేట్ చేశారు. ఆ త‌ర్వాత అనూహ్యంగా ఆమె అనారోగ్యానికి గుర‌య్యి అపోలో హాస్ప‌ట‌ల్లో చేర‌డం... ఆ త‌ర్వాత ఆమె మృతి చెంద‌డం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే.

 

అమ్మ మృతిపై ఎక్క‌డా లేని ఆరోప‌ణ‌లు, సందేహాలు వ‌చ్చాయి. ఇక అమ్మ మృతికి మున్నార్ గుడి మాఫియాకు లింకులు పెట్టి ఎవ‌రికి వారు రాసుకున్న వార్త‌ల‌కు లెక్కే లేదు. ఇక అమ్మ మృతి త‌ర్వాత అమ్మకు అత్యంత ప్రాణపదమైన పోయెస్ గార్డెన్ ను మ్యూజియంగా మార్చాలని కొంతకాలం డిమాండ్లు వినిపించాయి. ఈ డిమాండ్లు ఇలా ఉండ‌గానే ఇప్పుడు జ‌య‌కు అత్యంత ప్రాణ ప్ర‌ద‌మైన పోయెస్ గార్డెన్ ను త‌మిళ‌నాడు ప్ర‌భుత్వ స్వాధీనం చేసుకుంటూ జీవో జారీ చేసింది. 

 

ఈ పోయెస్ గార్డెన్ ను సొంతం చేసుకోవ‌డానికి జ‌య వార‌సుల మ‌ధ్య రాజీ కుద‌ర‌ని ప‌క్షంలో చివ‌ర‌కు దానిని ప్ర‌భుత్వం తాత్కాలికంగా స్వాధీనం చేసుకునేలా ఆర్డినెన్స్ జారీ అయ్యింది. ఇక ప్ర‌భుత్వ ఆర్డినెన్స్ కు త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్ భ‌న్వారీలాల్ సైతం పురోమిత్ ఓకే చెప్ప‌డంతో ఇప్పుడు జ‌య క‌ల‌ల స్వ‌ప్నం కాస్తా ప్ర‌భుత్వం చేతికి వెళ్లిపోయింది. వాస్త‌వంగా జ‌యకు ఉన్న చ‌ట్ట ప‌ర‌మైన వార‌సులు ఈ విష‌యాన్ని సామ‌ర‌స్య పూర్వ‌కంగా ప‌రిష్క‌రించుకుంటే అస‌లు ఇది ప్ర‌భుత్వం చేతికి వెళ్లేదే కాదు. ఏదేమైనా జీవితంలో ఎంతో పేరు ప్ర‌ఖ్యాతులు తెచ్చుకున్న జ‌య త‌న క‌ల‌ల స్వ‌ప్న‌మైన పోయెస్ గార్డెన్ ఇలా కోల్పోవాల్సి వ‌స్తుంద‌ని ఆమె ఎప్పుడు క‌ల‌లో కూడా అనుకుని ఉండ‌రేమో...?

మరింత సమాచారం తెలుసుకోండి: