నీతివంతమైన పాలనే లక్ష్యంగా నీ స్వార్థ రాజకీయాలే ఊపిరిగా బతికిన నీలం సంజీవరెడ్డి ఎమ్మెల్యే ఎంపీ మంత్రి ముఖ్య మంత్రి సభాపతి రాష్ట్రపతి లాంటి ఉన్నత పదవులను కేవలం ప్రజల కోసమే అధిరోహించి అసలు సిసలైన ప్రజల పాలకుడిగా పేరు పొందారు. ఈయన అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలంలోని పెన్నా నది ఒడ్డున గల ఒక చిన్న గ్రామమైన ఇల్లూరులో 1913 మే 18వ తేదీన సుబ్బమ్మ చిన్నపరెడ్డి దంపతులకు జన్మించారు. 


తాను మద్రాసు దివ్యజ్ఞాన సమాజం పాఠశాలలో ప్రాథమిక విద్యను పూర్తి చేసుకున్నారు. అనంతపురం జిల్లా లోని గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో తన డిగ్రీ పూర్తి చేశారు. 1929లో తనపై చదువును పక్కనపెట్టి మహాత్మాగాంధీ స్ఫూర్తితో రాజకీయాల్లో అడుగు పెట్టారు. 1935 జూన్ 8వ తేదీన ఇతను నాగరత్నమ్మను వివాహమాడాడు. వీళ్ళిద్దరి వైవాహిక జీవితంలో ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు పుట్టాడు. కుమారుడు సుధీర్ రెడ్డి కాగా... అతడి కొడుకు అనంతపురం జిల్లాలో వైద్య వృత్తిలో స్థిర పడ్డాడు. 

1937 సంవత్సరం లో ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రాంతీయ పార్టీ అయిన కాంగ్రెస్ కమిటీకి కార్యదర్శిగా ఎన్నికై దాదాపు పది సంవత్సరాల పాటు పదవిలో డేర్ అండ్ డాషింగ్ గా కొనసాగారు. మహాత్మా గాంధీని స్ఫూర్తిగా తీసుకొని స్వాతంత్ర సమర యోధుడిగా అవతారమెత్తి 1940 సంవత్సరంలో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని అరెస్టు కాబడి 1940 నుండి 45 సంవత్సర మధ్య కాలంలో జైలులోనే గడిపాడు. ఆ తర్వాత ఎన్నో పదవులను అధిరోహించిన నీలం సంజీవరెడ్డి మూడు రాష్ట్రాల రాజకీయాలను శాసించగలిగారు. 


దేశ రాజకీయాల్లో లోనూ తనదైన శైలిలో ముద్రవేసిన నీలం సంజీవరెడ్డి 1956 నవంబర్ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టారు. లాల్ బహదూర్ శాస్త్రి ఇందిరాగాంధీ హయాంలో కేంద్ర రవాణా, పౌర విమాన యానం ఓడరేవులు పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నీలం సంజీవరెడ్డి చాలా సాధారణ వ్యక్తిగా తమ గ్రామ ప్రజలతో కలసిమెలసి ఉండేవారు. 1996 జూన్ 1వ తేదీన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో తన 83 వ సంవత్సరం లో తుది శ్వాస విడిచారు నీలం సంజీవరెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: