తన తండ్రి అకాల మరణాంతరం ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగి 37 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీకి ఎదురొడ్డి దాదాపు 35 సంవత్సరాల చరిత్ర గల టీడీపీ పార్టీ తో పోరాడి 45 సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబునాయుడిని సింగిల్ హ్యాండ్ తో చిత్తు చిత్తుగా ఓడించి గెలిచిన పులివెందుల పులి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. 


యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి, విజయమ్మ లకు జమ్మలమడుగు(పులివెందుల) కడప జిల్లాలో 1972 డిసెంబర్ 21న జగన్ మోహన్ రెడ్డి జన్మించారు. జగన్ తర్వాత ఈ దంపతులకు షర్మిల 1973 సంవత్సరంలో జన్మించారు. జగన్ తన ప్రాథమిక విద్యాభ్యాసం పులివెందులలో పూర్తిచేశాడు. బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు. డిగ్రీ నిజాం కాలేజీ లో ప్రగతి విద్యాలయం లో బీకాం చదువును పూర్తి చేశాడు జగన్. గ్రాడ్యుయేషన్ పూర్తయిన అనంతరం లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో తన ఎంబీఏ చదవడానికి జగన్మోహన్ రెడ్డి ఇంగ్లాండ్ వెళ్ళాడు. కానీ ఏవో కొన్ని కారణాలవల్ల ఎంబీఏ చదువు పూర్తి చేయకుండానే అర్ధాంతరంగా ఇంటికి తిరిగి వచ్చేశాడు. నిజానికి జగన్ మోహన్ రెడ్డి తాను చదివిన ప్రతీ క్లాసులో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యేవాడు. 


వైయస్ రాజశేఖర రెడ్డి, సుగుణ రెడ్డి డాక్టర్ చదువు చదువుకొనేటప్పుడు క్లాస్ మేట్స్ గా ఉండేవారు. అయితే ఆమె కూతురు అయిన భారతీ రెడ్డి ని జగన్మోహన్ రెడ్డి కి ఇచ్చి పెళ్లి చేయాలని ఇరు కుటుంబ సభ్యులు అనుకొని 1996 ఆగస్టు 28 వ తేదీన వాళ్ళిద్దరికీ పెళ్లి చేసారు. పెళ్లి అయిన సమయంలో జగన్మోహన్రెడ్డికి కేవలం 24 సంవత్సరాలు మాత్రమే. 20 వైఎస్ఆర్ జీవితంలో హర్ష రెడ్డి వర్షా రెడ్డి అనే ఇద్దరు పిల్లల సంతానం కలిగింది. తమ పిల్లలు సరస్వతి కూతుర్ల వలె చదువులో బాగా రాణించే వారు. తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి రాజకీయాల్లోకి దిగినా తాను మాత్రం బెంగళూరులో ఉండే వ్యాపారాలు చేసేవాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: