పాకిస్థాన్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం కుప్ప‌కూలిన ఘ‌ట‌న‌లో 97 మంది మృతిచెందారు. క‌రాచీలోని జిన్నా ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్ట్ స‌మీపంలో ఉన్న మోడ‌ల్ కాల‌నీలో శుక్ర‌వారం విమానం కూలింది. అయితే ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన ఓ సీసీటీవీ ఫూటేజ్ రిలీజైంది. పాకిస్థాన్‌లో నిన్న జరిగిన విమాన ప్రమాదానికి ముందు తాము ఆపదలో ఉన్నామంటూ పైలట్ పంపిన హెచ్చరికలకు సంబంధించిన కాక్‌పిట్ సంభాషణ వెలుగులోకి వచ్చింది. విమానం క్రాష్ కావడానికి ముందు పైలట్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) మధ్య జరిగిన సంభాషణ ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్‌సైట్  ‘లైవ్ఏటీసీ.నెట్’లో ప్రత్యక్షమైంది. కాగా, విమానం లో జరిగిన సంబాషణ ప్రకారం.. తాము ప్రమాదంలో ఉన్నామని చెప్పేందుకు ‘మేడే, మేడే, మేడే’ అనే సందేశాన్ని పైలట్ ఏటీసీకి పంపాడు.

 

ఆ వెంటనే రాడార్‌తో సంబంధాలు తెగిపోయి విమానం కూలిపోయింది.తొలుత పైలట్ విమానం అప్రోచ్ అవుతున్నట్టు ఏటీసీకి తెలిపాడు. అందుకు ఏటీసీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీంతో మేం ఎడమవైపునకు తిరగాలా? అని పైలట్ మళ్లీ ప్రశ్నించాడు.దీనికి ఏటీసీ నుంచి అవును అని గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అయితే, విమానం రెండు ఇంజిన్లు దెబ్బతిన్నాయని, తాము నేరుగా వెళ్తున్నామని పైలట్ మళ్లీ చెప్పాడు.

 

ఇదిలా ఉంటే..  విమానం కూలిన ప్రాంతంలోని ఓ ఇంట్లో ఉన్న సీసీటీవీ కెమెరాల‌కు ఆ ప్ర‌మాద ఘ‌ట‌న చిక్కింది.  బిల్డింగ్‌ల‌పై విమానం కూలుతున్న‌ట్లు ఆ వీడియోలో ఉన్న‌ది. ల్యాండింగ్ స‌మ‌యంలో విమానం నేరుగా ఇండ్ల‌పై కూలినట్ల ఆ వీడియోలో క‌నిపిస్తోంది.  ప్ర‌మాదానికి ముందు పైల‌ట్‌.. ఏటీసీ అధికారుల‌తో సంప్ర‌దించిన‌ట్లు తెలుస్తోంది. విమానంలో సాంకేతిక లోపం త‌లెత్తిన‌ట్లు అత‌ను చెప్పిన‌ట్లు  పేర్కొంటున్నారు. ‌న్‌వేకు కొన్ని వంద మీట‌ర్ల దూరంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. అయితే ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు మాత్రం ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. విమానంలో 91 మంది ప్యాసింజెర్లు, 8 మంది సిబ్బంది ఉండ‌గా, దాంట్లో 19 మందిని ఇప్ప‌టి వ‌ర‌కు గుర్తించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: