ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కార్పొరేట్ వైద్యానికి ధీటుగా ప్రభుత్వ వైద్యాన్ని అభివృద్ధి చేశామని అన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలు పూర్తి సంతృప్తితో ఉన్నాయని చెప్పారు. పాలన ఎలా సాగాలో వైయస్ జగన్ చేసి చూపించారని వైద్య, విద్యకు సంబంధించి పూర్తి భరోసా ఇచ్చామని అన్నారు. తొలి సంవత్సరం పాలన అద్భుతంగా నడిచిందని తెలిపారు. 
 
దూరదృష్టితో సీఎం జగన్ పాలన సాగిస్తున్నారని అన్నారు. కచ్చితమైన తేదీకి పింఛన్ అందించిన ఘనత సీఎం జగన్ కు మాత్రమే దక్కుతుందని తెలిపారు. ఎన్నికల కోసం హామీలు ఇవ్వలేదని.. అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చామని అన్నారు. మాతృభాషపై చిన్నచూపు చూడకుండా పేదలందరికీ ఇంగ్లీష్ మీడియం అందించాలనే ప్రభుత్వ లక్ష్యం అని చెప్పారు. 
 
ప్రజలకు ఏ ఆపద వచ్చినా స్పందించే గుణం సీఎం జగన్ దని అన్నారు. తొలి ఏడాది సంక్షేమ దిశగా ప్రభుత్వం పాలన సాగిస్తోందని అన్నారు. నాలుగేళ్ల అనంతరం ఏపీని సీఎం జగన్ నంబర్ వన్ స్థానంలోనే ఉంటుందని తెలిపారు. సరిగ్గా ఇదే రోజు రాష్ట్రం చారిత్రాత్మక ఘట్టాన్ని ఆవిష్కరించిందని చెప్పారు. కనివినీ ఎరుగని రీతిలో 50 శాతం ఓట్లతో వైసీపీ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. 
 
ఈ సంవత్సర కాలం సంక్షేమ సంవత్సరం అని సజ్జల అన్నారు. వైయస్సార్ ఆశయాలను సీఎం జగన్ నెరవేరుస్తున్నారని అన్నారు. జగన్ ఇచ్చిన హామీలకు మించి అమలు చేస్తున్నారని చెప్పారు. జగన్ మానవీయ కోణంతో ప్రజలకు మరింత మంచి జరిగేలా పాలన సాగిస్తున్నారని అన్నారు. బ్రహ్మాండమైన సంక్షేమ సంవత్సరంగా అన్ని రంగాలను దృష్టిలో ఉంచుకుని జగన్ పాలన సాగిస్తున్నారని సజ్జల మీడియాతో చెప్పారు.                             

మరింత సమాచారం తెలుసుకోండి: