కేరళ ఇప్పట్లో కరోనా ఫ్రీ అయ్యేలా కనిపించడం లేదు రెండు వారాల ముందు వరకు రోజుకు ఒకటి రెండు కేసులు నమోదవుకుంటూ రాగ ఇప్పుడు మాత్రం పరిస్థితి భిన్నంగా వుంది. విదేశాల నుండి సొంత రాష్ట్రానికి వస్తున్న వారి వల్ల రోజు భారీగా కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఒక్క రోజే  రాష్ట్ర వ్యాప్తంగా  42కేసులు నమోదు కాగా అన్ని కూడా విదేశాల నుండి వచ్చినవారివే కావడం గమనార్హం. ఇప్పటివరకు కేరళ లో మొత్తం 732 కేసులు నమోదు కాగా అందులో 512బాధితులు కోలుకోగా నలుగురు మరణించారు. ప్రస్తుతం 207 కేసులు అక్టీవ్ గా వున్నాయి అయితే మిగితా రాష్ట్రల తో పోలిస్తే అటు కరోనా రికవరీ రేట్ లో కానీ మరణాల తగ్గుదల విషయంలో కానీ కేరళ మొదటి స్థానం లో వుంది. 
 
ఇక గడిచిన 24గంటల్లో 6654కేసులు నమోదు కాగా 137 మరణాలు సంభవించాయి. దేశ వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 125101కు చేరగా అందులో 51784మంది బాధితులు కోలుకోగా 3720కరోనా వల్ల మరణించారు. ప్రస్తుతం 69597కేసులు యాక్టీవ్ గా వున్నాయి. దేశంలో లాక్ డౌన్ 4 కొనసాగుతుండగా చాలా రాష్ట్రాల్లో భారీగా కేసులు  నమోదవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: