టీడీపీలో సీనియ‌ర్ ఎమ్మెల్యేగా ఉన్న ఓ వ్య‌క్తి ఇప్పుడు చంద్ర‌బాబు తీరుతో పార్టీకి దూరం దూరంగా ఉంటున్నారా ?  బాబోరి తీరుతో ఆయ‌న అల‌క పాన్పుతో ఉంటున్నారా ? అంటు అవున‌నే చ‌ర్చ‌లు ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ.. ముఖ్యంగా టీడీపీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. స‌ద‌రు సీనియ‌ర్ ఎమ్మెల్యే ఎవ‌రో కాదు విజ‌య‌వాడ తూర్పు ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్. గ‌ద్దె రామ్మోహ‌న్ టీడీపీలో ఎంత సీనియ‌ర్ నేతో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. చంద్ర‌బాబు గ‌తంలో ఆయ‌న్ను త‌న రాజ‌కీయ అవ‌స‌రాల కోసం అనేక ర‌కాలుగా ఇబ్బంది పెట్టారు. గ‌న్న‌వ‌రం ఎమ్మ‌ల్యేగా ఉన్నా కూడా ప‌ని గ‌ట్టుకుని గ‌ద్దెను విజ‌య‌వాడ ఎంపీగా పోటీ చేయించారు. త‌ర్వాత ఆయ‌న్ను కంకిపాడుకు మార్చారు.

 

త‌ర్వాత 2009 ఎన్నిక‌ల్లో విజ‌య‌వాడ తూర్పుకు మార్చారు. ఆ ఎన్నికల్లో స్వ‌ల్ప తేడాతో ఓడిన గ‌ద్దె 2014తో పాటు 2019 ఎన్నిక‌ల్లో తూర్పు నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌రుస విజ‌యాలు సాధించారు. విజ‌య‌వాడ తూర్పులో రెండు ద‌శాబ్దాలుగా గ‌ద్దె తిరుగులేని నేత‌గా పాతుకు పోయారు. అయితే గ‌ద్దె సంక్లిష్ట ప‌రిస్థితుల్లోనూ గెలుస్తున్నా చంద్ర‌బాబు మాత్రం అదే జిల్లాలో ఉమా లాంటి నేత‌ల‌కే ప్ర‌యార్టీ ఇస్తూ వ‌స్తున్నారు. ఇది గ‌ద్దెకు న‌చ్చ‌లేదు. ఇక గ‌త ఎన్నిక‌ల్లో భ‌యంక‌ర‌మైన వ్య‌తిరేక  గాలుల‌ను త‌ట్టుకుని గ‌ద్దె గెలిచినా కూడా చంద్ర‌బాబు ఆయ‌న్ను ప‌ట్టించుకోవ‌డం లేద‌న్న ఆవేద‌న ఆయ‌న‌లో ఉంది. 

 

ఇక జిల్లాలో టీడీపీ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో గెలిచిన ఇద్ద‌రు ఎమ్మెల్యేల్లో గ‌న్నవ‌రం ఎమ్మెల్యే వ‌ల్లభ‌నేని వంశీ మోహ‌న్ కూడా ఇప్పటికే వైసీపీకి చేరువ‌య్యారు. ఇక పార్టీకి మిగిలిన గ‌ద్దె ఒక్క‌రు కూడా పార్టీకి దూరంగా ఉండ‌డంతో కృష్ణా జిల్లా రాజ‌కీయాల్లో సంచ‌ల‌నంగా మారింది. పార్టీ కోసం ఎన్నో ఆటు పోట్ల‌ను ఎదుర్కొని తాను క‌ష్ట‌ప‌డుతున్నా.. త‌న‌తో పాటు గెలిచిన విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నానికి కాని.. త‌న‌కు గాని బాబు ప్ర‌యార్టీ ఇవ్వ‌క పోవ‌డాన్ని ఆయ‌న అస్స‌లు జీర్ణించు కోలేక‌పోతున్నార‌ట‌.
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: