వరంగల్ బావి సంఘటన రోజు రోజుకి ఒక మలుపు తిరుగుతుంది. ఆ బావిలో నుంచి వెలికితీసిన తొమ్మిది మృత దేహాలు వ్యవహారంలో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే తాజాగా ఆ 9 మృతదేహాలకు పోస్ట్ మార్టం పూర్తి అయ్యింది. ఇక రిపోర్టు గురించి వెయిట్ చూస్తున్నారు. అయితే ఇది హత్యలా లేదంటే ఆత్మహత్యలా అనే కోణంలో పోలీసులు పూర్తి విచారణ జరుపుతున్నారు. ఈ కేసును పెనుసవాలుగా తీసుకున్న పోలీసులు విచారణ కోసం ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. అందులో చనిపోయిన వారి ఫోన్లు సాయంత్రమే స్విచ్ ఆఫ్ అవడంతో మక్సూద్ ఫోన్ మాత్రం రాత్రి 9 గంటల వరకు ఆన్లోనే ఉండడంతో అతడిపై కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 

పుట్టిన రోజు వేడుకలను బుధవారం రాత్రి జరపగా అందరూ కలిసి విందు చేసుకోవడం జరిగింది. అయితే గురువారం ఉదయం ఇంట్లో ఎవరూ లేకపోవడంతో వారి ఆచూకీ కోసం వెతకగా బావిలో 4 శవాలు కనపడ్డాయి. ఆ తర్వాత రోజు మరో ఐదు శవాలను బయటకు తీశారు. ఆ తర్వాత మృతదేహాలను గుర్తించి మక్సూద్ నివాసం ఉంటున్న గదులను తనిఖీ చేశారు. అయితే మసూద్ జేబులో కండోమ్ ప్యాకెట్ కనబడింది.పెళ్లయి ముగ్గురు పిల్లలు ఉన్న అతని దగ్గర కండోమ్ ఎందుకు ఉందంటూ అనేక అనుమానాలకు దారి తీస్తోంది ఆ విషయం. అందరి సెల్ ఫోన్స్ మాత్రం సాయంత్రమే స్విచాఫ్ అవ్వగా ఫోన్ మాత్రం రాత్రి వరకు ఆన్లైన్లో ఉండడం కూడా పలు అనుమానాలకు దారి తీస్తోంది.


ఇకపోతే గురువారం నాడు ఉదయం మక్సూద్, ఆయన భార్య, మక్సూద్ కుమార్తె, మరో మూడేళ్ల బాలుడి మృతదేహాలను గురువారం బావిలో నుండి బయటకు తీశారు. అలాగే శుక్రవారం నాడు బావిలో నీటిని తోడగా అందులో కుమారులు మృతదేహాలు, అలాగే వాహనాలను నడిపే డ్రైవర్, అలాగే బీహార్ కు చెందిన మరో ఇద్దరి వ్యక్తుల మృతదేహాలు బయటికి వచ్చాయి. అయితే పోలీసులు ఈ శవాల వెనక వివాహేతర సంబంధం వల్లే వీరందరినీ ఎవరైనా హత్య చేశారా..? అనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. లేకపోతే మక్సూద్ వారందరికీ ఆహారంలో విషం కలిపి ఇచ్చిన తర్వాత స్పృహ కోల్పోయిన వారిని బావిలోకి పడేసి ఉంటాడని తర్వాత అతడు కూడా ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: