లాక్ డౌన్ సమయంలో పుట్టుకొచ్చిన ప్రేమకథలు వింటుంటే చాలా మంచి ఫీలింగ్ ఎవరికైనా వస్తుంది. ఒక వైపు కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ... మరోవైపు జీవితంలో ఆశలు, ప్రేమ నింపడానికి ఎవరైనా అనుకోకుండా అడుగు పెడితే ఎంత బాగుంటుంది? ఇలాంటి సంఘటన ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ కి చెందిన వ్యక్తికి జీవితంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాలు తెలుసుకుంటే... ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ సిటీకి చెందిన అనిల్ అనే వ్యక్తి సోషల్ వర్కర్, ప్రాపర్టీ డీలర్ అయిన లలిత ప్రసాద్ కారు డ్రైవర్ గా పని చేస్తున్నాడు. 


భారత దేశ వ్యాప్తంగా ప్రకటించడంతో చాలామంది కటిక పేద వాళ్ళు తినడానికి తిండి లేక రోడ్లపైనే తమ జీవితాన్ని ఈడ్చుకోస్తున్నారు. అయితే ఇలాంటి వారిని ఆదుకునేందుకు చాలామంది ఆహార పొట్లాలను మంచినీళ్ల బాటిళ్లను అందిస్తున్నారు. డ్రైవర్ అనిల్ కూడా కాన్పూర్ సిటీ లో ఆకలితో అలమటిస్తున్న పేదవారికి ఆహార పొట్లాలను పంపిణీ చేయడం ప్రారంభించాడు. అయితే ఒక బ్రిడ్జి కింద ఆశ్రమం ఏర్పరచుకున్న కొంతమందికి ప్రతిరోజు ఆహార పొట్లాలను అందించేవాడు అనిల్. ఒకానొక రోజు ఆ బ్రిడ్జి కింద అందరి పేదవాళ్ళు ఆహార పొట్లాల కోసం వేచి చూస్తూ ఉండగా అనిల్ కుమార్ ఆహార పొట్లాలను తీసుకొచ్చి వారికి ఇచ్చాడు. 

 

ఆ క్రమంలోనే నీలం అనే ఒక అమ్మాయిని అనిల్ చూసి బాగా ఇష్టపడ్డాడు. తదనంతరం ఆ అమ్మాయి తో మాట్లాడడం ప్రారంభించాడు. ఈ విషయం కాస్త తన యజమాని అయిన లలిత ప్రసాద్ కి తెలియడంతో ఆ అమ్మాయికి రెండుసార్లు ఆహార పొట్లాలు అందించమని అనిల్ చెప్పాడు. అప్పటినుండి అనిల్ ఆమె కోసం తానే స్వయంగా వంట చేసి రెండుపూటలా ఆహార పొట్లాలను అందించేవాడు. కాలక్రమేణా వాళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఈ విషయం కాస్త అనిల్ ఇంట్లో తెలియడంతో వారు అనిల్ పై కోప్పడ్డారు. ఆ అమ్మాయి పై అంత ప్రేమ ఉంటే పెళ్లి చేసుకో పో అని అన్నారు. 


ఈ విషయం కూడా లలిత ప్రసాద్ కి తెలియడంతో యాచకురాలు అయిన నీలం గురించి అన్ని విషయాలు ఆరా తీయగా... ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారని... మావయ్య కూడా ఆ అమ్మాయిని వదిలేశాడని తెలిసింది. ఆ తర్వాత లలిత ప్రసాద్ అనిల్ కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిని ఒప్పించి నీలం తో కూడా ఇష్టాయిష్టాలు తెలుసుకుని వాళ్ళిద్దరికీ పెళ్లి చేశారు. ప్రస్తుతం ఈ నూతన దంపతులు ఎంతో అన్యోన్యంగా సంతోషంగా జీవితాన్ని కొనసాగిస్తున్నారని యజమాని లలిత ప్రసాద్ చెప్పుకొచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: