దేశంలో గత వారం, పది రోజుల నుంచి వలస కార్మికుల గురించి భారీ స్థాయిలో చర్చ జరుగుతోంది. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కార్మికులు సొంతూళ్లకు చేరుకుంటున్నారు. కేంద్రం ఇప్పటికే 1700కు పైగా ప్రత్యేక రైళ్లను నడిపింది. ప్రత్యేక బస్సుల ద్వారా పలు రాష్ట్రాలు కార్మికులను సొంతూళ్లకు తరలిస్తున్నాయి. అయితే ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. నాణేనికి మరోవైపు వలస కార్మికులు సొంతూళ్ల నుంచి గతంలో ఉపాధి పొందిన రాష్ట్రాలకు చేరుకుంటున్నారు. 
 
దేశంలో చాలా ప్రాంతాలలో వలస కార్మికులు ఉపాధి ఉన్న రాష్ట్రాలకు తిరుగుప్రయాణమవుతున్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజంగా జరుగుతోంది. కేంద్రం నాలుగో విడత లాక్ డౌన్ లో భాగంగా భారీ సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో చాలా రాష్ట్రాలలో పరిశ్రమలు తెరిచారు. పరిశ్రమలు నడవాలంటే వలస కార్మికుల అవసరం ఎంతో ఉంది. అనేక పరిశ్రమల యాజమాన్యాలు వలస కార్మికులపై ఆధారపడే పరిశ్రమలు నడిపిస్తున్నాయి. 
 
కేంద్రం బస్సు సర్వీసులు ప్రారంభించడంతో పాటు జూన్ 1 నుంచి రైళ్లు ప్రారంభమవుతుండగా వలస కార్మికులు పెద్దఎత్తున ప్రయాణిస్తున్నారని తెలుస్తోంది. ఇన్నిరోజులు వలస కార్మికులు ఉపాధి లేకపోవడంతో సొంతూళ్లకు పయనమయ్యారు. కానీ అక్కడ ఏ పనులు లేక వారు ఇబ్బందులు పడుతున్నారు. నరేగా స్కీమ్ కింద లోకల్ గా పనులు కల్పించాలని కేంద్రం చెప్పినప్పటికీ అక్కడ వారికి లభించేది 200 రూపాయలు మాత్రమే. 
 
భవన నిర్మాణ కార్మికులు, వ్యవసాయ కూలీలు, పరిశ్రమల్లో పని చేసేవారు రోజుకు 400 నుంచి 600 రూపాయలు సంపాదిస్తున్నారు. కొన్ని సంస్థలు ప్రత్యేకంగా కంపెనీలు, భవన సంస్థలకు వలస కూలీలకు మధ్య మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నాయి. ఈ సంస్థలు ఇప్పటికే వలస కూలీలను సంప్రదించి ఉపాధి కల్పిస్తామని... గతంలో పని చేసిన కంపెనీల దగ్గరకు చేరుకోవాలని చెబుతున్నట్టు తెలుస్తోంది. ఎంతో కష్టపడి కేంద్రం వలస కార్మికులను సొంతూళ్లకు చేర్చగా వలస కార్మికులు మాత్రం రివర్స్ వస్తూ కేంద్రానికి షాక్ ఇస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: