ఒక అమావాస్య ... భార్య భర్త ఇద్దరి ప్రాణం మీదకు వచ్చింది. అమావాస్య అని ఆగిపోవడమే వారికి శాపంగా మారింది. రెండు రోజులు ఆగి కొత్త ఇంటికి వెళ్దాం అనుకున్నాం కుటుంబాన్ని మృత్యువు ఒడి చేర్చుకుంది. అద్దెకు ఉంటున్న ఇంట్లో గోడకూలి ముగ్గురి ప్రాణాలు బలితీసుకుంది. మరో ముగ్గురు పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారారు. ఈ దారుణ సంఘటన తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో జరిగింది.

 


ఇక అసలు విషయానికి వెళ్తే... లక్ష్మి, శ్రీనివాస్ లకు పది సంవత్సరాల కింద వివాహం జరిగింది. వీరికి నలుగురు పిల్లలు. కొద్దిరోజులు అత్తింటి వద్ద కాపురమున్న లక్ష్మి తన అమ్మ వారి ఊర్లో ఒంటరిగా ఉంటుందని కుటుంబంతో కలిసి ఆ ఊరికి వెళ్లి నివాసం ఉంటోంది. అయితే అక్కడే భార్యాభర్తలు ఇద్దరూ కలిసి పనులు చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ఇక సొంతిల్లు నిర్మించుకోవాలని కోరికతో పంచాయతీ వారిని సంప్రదిస్తే వారు ఖాళీ స్థలాన్ని వారికి మంజూరు చేయడం జరిగింది. ఇక ఆ స్థలంలో  రేకుల షెడ్డు నిర్మించుకొని ఆ దంపతులిద్దరూ కొత్త ఇంట్లోకి వెళ్దామని అనుకున్నారు. 

 


అయితే  ఇక ఇలా అనుకుంటుండగా అమావాస్య రావడంతో మూడు రోజులు ఆగి వెళ్దామని ఆ పనిని వాయిదా వేసుకున్నారు. అయితే ఆ షెడ్డు వద్ద పనులు ముగించుకొని అద్దెకు ఉంటున్న ఇంటికి వచ్చి భోజనం చేసి పడుకున్నారు అందరు. అయితే తెల్లవారుజామున లేచి ఇంటి పనులు చేసుకుంటుండగా ఒక్కసారిగా ఇంటి గోడ కుప్పకూలిపోయింది. ఆ సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న శ్రీనివాస, లక్ష్మి దంపతులు సహా పిల్లలపై సిమెంట్ పెళ్లలు పడడంతో తీవ్రగాయాలు అయ్యాయి. అయితే ఈ సంఘటనలో భార్య లక్ష్మి ఒక సంవత్సరం ఉన్న కొడుకు సాయి కుమార్ అక్కడికక్కడే చనిపోగా ఆస్పత్రికి తరలిస్తుండగా భర్త శ్రీనివాస్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఇక ఇక మిగతా ముగ్గురు కూతుర్లు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: