కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఉనికి పాట్లు పడుతోంది. దేశంలో పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఇతర సీనియర్ నేతలు అనేక ప్రయత్నాలు చేస్తున్నా కూడా అంతగా సత్ఫలితాలు మాత్రం రావడం లేదు. అయితే ఇటీవల వారు ఒక సరికొత్త వ్యూహం అంటే సరికొత్త వ్యూహం ఏమీ కాదు గానీ మళ్లీ మైనార్టీలు, ఎస్సీలు, ఎస్టీల‌ను దగ్గరకు చేర్చుకునే పనిలో నిమగ్నమైన‌ట్లు తెలుస్తోంది. నిజానికి ఈ దేశంలో ఎక్కువ సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంది. మొదటి నుంచి కూడా ఈ పార్టీ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఓటు బ్యాంకు పైనే ఎక్కువగా ఆధారపడింది.

 

అయితే  క్రమంగా ఈ పార్టీకి ఆయా వర్గాలు దూర‌మ‌వుతూ వ‌చ్చాయి. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ తన ప్రాభవాన్ని కోల్పోతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే అనేక రాష్ట్రాల్లో తీవ్ర పరిస్థితి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోంది. అయితే  ఇప్పుడు మళ్లీ ఎస్సీ, ఎస్టీ,  మైనార్టీ వర్గాలను తనవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం వలస కార్మికులు, కూలీల సమస్యలే ప్రధాన ఎజెండాగా తీసుకుని ముందుకు వెళ్తోంది. లాక్ డౌన్ కారణంగా వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కార్మికులు, కూలీలు వందల కిలోమీటర్లు న‌డిచి తమ తమ స్వస్థలాలకు నడిచి వెళ్తున్నారు.

 

ఈ సమస్యను ప్రధాన ఎజెండాగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. ఇందులో భాగంగానే వలస కార్మికులను తరలించేందుకు అయ్యే ఖర్చు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ భరిస్తుందని సోనియాగాంధీ ప్రకటించిన విషయం తెలిసిందే. నిజానికి ఇప్పటికీ అనేక రాష్ట్రాల్లో వలస కార్మికుల రైలు చార్జీలను కాంగ్రెస్ పార్టీ భరిస్తోంది. మరికొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేసి వారి స్వస్థలాలకు తరలిస్తోంది. ఇక్కడ మరొక విషయం ఏమిటంటే.. ఢిల్లీ వీధుల్లో ఉన్న వలస కార్మికుల దగ్గరికి వెళ్లి రాహుల్ గాంధీ ప్రత్యేకంగా మాట్లాడిన విషయం తెలిసిందే. వాళ్లతో కింద కూర్చుని వారి కష్టనష్టాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు.

 

ఇది కూడా వ్యూహంలో భాగమేనని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. ఇదంతా కూడా ఆయా వర్గాలకు దగ్గరయ్యేందుకు చేస్తున్న ప్రయత్నంగా పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వలస కూలీలు కార్మికులు ఎక్కువగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల నుంచే ఉన్నారు. అందులో భాగంగా ఈ ఓటు బ్యాంకును మళ్ళీ తన సొంతం చేసుకునేందుకు ఇప్పటి నుంచే కాంగ్రెస్ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వీళ్ల‌ వ్యూహం ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి మరి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: