దాదాపు తొమ్మిది సంవత్సరాలు కష్టంతో అనేక ఆటుపోట్లను ఎదుర్కొని అధికారంలోకి వచ్చాడు జగన్. ఒక ముఖ్యమంత్రి కొడుకుగా అనేకమైన విలాసవంతమైన జీవితాన్ని వదులుకొని కుటుంబం కంటే ప్రజలను ఎక్కువగా భావించాడు. వైయస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత జగన్ ఎక్కువగా కనిపించింది రోడ్డుపైనే. అది కూడా ప్రభుత్వాలు మరియు రాజకీయ నాయకులు పట్టించుకోని ప్రజల దగ్గరగా తన రాజకీయాన్ని అటాచ్ చేసుకుని దేశంలో పెద్ద పెద్ద మహా నాయకులను తలవంచేల విజయాలు సాధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఒకపక్క వ్యతిరేకంగా ఉన్న మీడియా మరోపక్క అనేక రాజకీయ పార్టీల కుట్రలు అన్నిటినీ జయించి ఆంధ్ర ప్రజల అభిమానాన్ని దక్కించుకుని 2019 లో చరిత్రాత్మకమైన విజయాన్ని నమోదు చేసుకున్నారు.

 

జగన్ అధికారంలోకి రావడమే తనకి ప్రజలకు ఉన్న బాండింగ్ ఏమాత్రం పాడవకుండా గ్రామ సచివాలయాలు వాలంటీర్ల వ్యవస్థను అందుబాటులోకి తెచ్చి తన ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా ప్రజల ఇంటికే చేరటానికి శ్రద్ధ తీసుకున్నారు. ఆర్థికంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా ఆర్భాటాలకు పోకుండా ప్రభుత్వ ఖర్చులు తగ్గించుకుంటూ ప్రజలకు అద్భుతమైన సంక్షేమ పరిపాలన ఏడాదిలో అందించాడని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. ఒక విధంగా చెప్పాలంటే రాష్ట్ర ఖజానాకు ఏ రూపంలో సొమ్ము సమకూరినా వాటిని సంక్షేమపథకాలవైపు మళ్లించారు. కరోనా వైరస్ కష్టకాలంలో కూడా ఉచితంగా రేషన్ ఇచ్చే కార్యక్రమం చేపడుతూ మరోపక్క నగదు రూపంలో కూడా ప్రజలకు జగన్ సహాయం చేశారు.

 

అయితే అధికారంలోకి వచ్చి జగన్ ఏడాది మొత్తంలో అంతా బాగానే ఉన్నా కానీ ఇటీవల కరెంటు బిల్లులు చెల్లింపుల మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. లాక్ డౌన్ ఎఫెక్ట్ తో ఉద్యోగాలకు వెళ్ళలేక ఇంటిలో కుటుంబాలను పోషించు కోలేని కరెంట్ బిల్లు వేలకు వేల రూపంలో రావడంతో విమర్శలు వస్తున్నాయి. విద్యుత్ బిల్లుల ఎఫెక్ట్ స్థానిక సంస్థల ఎన్నికల్లో జగన్ పార్టీని ఇరుకున పెట్టే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే విపక్షాలు విద్యుత్ బిల్లులు పెంచిన విషయం లో ఆందోళనలు చేపట్టడానికి రెడీ అవుతున్నారు. మరి ఈ విషయంలో జగన్ జాగ్రత్త పడితే బాగుంటుందని లేకపోతే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: