సమాజంలో మనుషులు ఉన్న కొద్ది క్రూరంగా మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు. కరోనా వంటి కష్ట కాలం లో మనిషికి మనిషి అండగా ఉండాల్సిన టైంలో ఒకరిని ఒకరు దోచుకుంటూ సమాజాన్ని బ్రష్టు పట్టిస్తున్నారు. చాలాచోట్ల కరోనా వైరస్ వల్ల పేదవారి జీవితాలు ప్రమాదకరం లో పడటంతో సహాయ కార్యక్రమాలు చేస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్న మరోపక్క కొంతమంది క్రూరులు చేస్తున్న పనులు వల్ల సమాజంలో కి కరోనా వైరస్ వచ్చిందేమో అన్న భావన కలుగుతోంది. కనీసం మనుషుల్లాగా ప్రవర్తించకుండా బుద్ధి జ్ఞానం లేకుండా పరుల సొమ్ము దోచుకోవడానికి రెడీ అయిపోతున్నారు. అది కూడా పేద వారి దగ్గర.

 

పూర్తి వివరాల్లోకి వెళితే ఓ పేదవాడు బండిపై మామిడి కాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అటువంటి పేదవాడి దగ్గర గుంపులు గుంపులుగా జనాలు ఎగబడి వృద్ధాప్యంలో ఉన్న ఆ పేదవాడి మామిడికాయలను దొంగిలించి అతని పొట్ట కొట్టారు. ఏమాత్రం మానవత్వం లేని నీచమైన మనుషుల్లాగా ప్రవర్తించారు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలోని జ‌గ‌త్‌పురి ఏరియాలో చోటు చేసుకుంది. మామిడి కాయలు అమ్ముతున్న స్థలం దగ్గరికి ఢిల్లీ పోలీసులు వచ్చి ఖాళీ చేయమని మైక్ లో అనౌన్స్ చేశారు. దీంతో ఆ పేదవాడు పోలీసుల దగ్గరికి మాట్లాడదామని వెళ్లే లోపు ఆ టైంలో బండి దగ్గర ఎవరు లేరని కొందరు మామిడికాయలను ఎగబడి మరీ దోచుకున్నారు.

 

గుంపులుగా వ‌చ్చి సంచులు, హెల్మెట్ల‌లో ఆ పండ్ల‌ను నింపుకుని.. ఎంచ‌క్కా.. ద‌ర్జాగా.. తామేదో ఆ పండ్ల‌ను కొనుగోలు చేసిన‌ట్లు.. త‌మ కోసం ఆ పండ్ల‌ను అక్క‌డ పెట్టిన‌ట్లు ప్ర‌వ‌ర్తిస్తూ.. వాటిని దొంగిలించుకుపోయారు. దీంతో ఆ పేదవాడు పోలీసులు దగ్గర నుండి వస్తూ తన బండి మీద మామిడి కాయలు లేని పరిస్థితి చూసి లబోదిబోమని కన్నీరు పెట్టుకున్నారు. దాదాపు ఆ మామిడికాయల విలువ 30 వేల రూపాయలు ఉంటుందని అంచనా. దీంతో అదే సమయంలో పోలీసులను తనకు న్యాయం చేయాలని ఆ పేదవాడు కోరాడు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: