జనసేనను స్థాపించిన నాటికి పవన్ ది ఆవేశంపూరిత రాజకీయం. ఇంకా చెప్పాలంటే ప్రజారాజ్యం ఫెయిల్ అవడానికి ఏవేవో కారణాలు ఆయన తనకు తానుగా ఊహించుకున్నారు. అన్నయ్య మెగాస్టార్ ని నాయకులు అంతా మోసం చేశారని ఆయనే జనసేన అధినేతగా మారాక కూడా చెప్పుకున్నారు. తమ కుటుంబానికి అపారమైన సినీ గ్లామర్ ఉంది. ఓ బలమైన సామాజికవర్గం దన్ను ఉంది. ఇవి చాలవా  ముఖ్యమంత్రి పీఠం పట్టేయడానికి అనుకున్నారు కూడా.

 

కానీ అసలు రాజకీయం లోతులు చూస్తే కానీ విషయం అర్ధం కాలేదని అంటారు. పవన్ ఎన్నో ఆశలు పెట్టుకుని సొంతంగా పోటీ చేసిన 2019 ఎన్నికలు ఆయన ఆశలను చిదిమేశాయి. ఓ విధంగా చెప్పాలంటే ఎటూ కాకుండా చేశాయి. కర్నాటకలో  ముఖ్యమంత్రి అయిన  కుమారస్వామి తరహాలో కనీసం నలభై సీట్లు తెచ్చుకున్నా  కూడా ముఖ్యమంత్రి పీఠం అందుతుందని వేసుకున్న అంచనాలు బాగా తప్పేశాయి.

 

అదే సమయంలో రెండు చోట్ల తాను పోటీ చేస్తే ఎక్కడా గెలవకపోవడమూ పవన్ కి పరాభవాన్నే మిగిల్చింది. ఇక గెలిచిన ఒకే ఒక ఎమ్మెల్యే కూడా ఈ ఏడాది కాలలో వైసీపీకి చేరువ అయ్యేట్లుగా ఉన్నారు. దీంతో పవన్ ఏడాదిగా ఏం సాధించారు అని ఆలోచిస్తే ఆయన మళ్ళీ సినిమాలు చేసుకుంటూ రాజకీయం కూడా కలసి చేద్దామని నిర్ణయం తీసుకున్నారనుకోవాలి.

 

ఎన్నో ఆశలతో  రాజకీయాల్లోకి వచ్చిన పవన్ తన అన్నను మించి సాధిద్ధామనుకున్నారు కానీ ఏపీ రాజకీయం మాత్రం అంత సులువుగా ఒడిసిపడితే అందేది కాదని అర్ధమయ్యేసరికి ఒక ఏడాది గడచిపోయింది. ఇక బీజేపీతో పొత్తు పెట్టుకున్నా ఏపీలో ఆ పార్టీకి పెద్దగా ఓటు బ్యాంక్ లేదు. దాంతో పవన్ మరో నాలుగేళ్ళ తరువాత ఏ విధంగా తన పార్టీని ముందుకు తీసుకెళ్తారన్నది కూడా ఒక ప్రశ్నగానే ఉంది. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ రాజకీయానికి గట్టి దెబ్బ కొట్టిన 2019 పాత అనుభవమే కాదు, చేదు అనుభవం కూడా  అంటున్నారంతా.

 

మరింత సమాచారం తెలుసుకోండి: