అంఫాన్ తుఫాను పశ్చిమ బెంగాల్ లో బీభత్సం సృష్టిస్తోంది. పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ ల మధ్య తుఫాను తీరం దాటడంలో కోల్​కతాలో భారీ ఈదురుగాలులతో కుండపోతగా వర్షం పడింది. గంటకు 185 కిలోమీటర్ల వేగంతో వీచిన పెను గాలులు హుగ్లీ, హవ్​డా, మిడ్నాపూర్, 24 పరగణా జిల్లాలను కుదిపేశాయి. కోల్‌కతాలో బలమైన గాలుల ధాటికి చెట్లు, కరెంటు స్లంభాలు నేలకూలి వాహనాలు, ఇండ్లు దెబ్బతిన్నాయి.. తుఫాన్ ధాటికి కోల్‌కతా ఎయిర్‌పోర్టులో ఒక ఎయిర్ ఇండియా విమానం దెబ్బతిందని అధికారులు చెప్పారు.  బలంగా గాలులు వీయడంతో రెండు జిల్లాలు అతలాకుతలం అయ్యాయన్నారు. కరోనా వైరస్ మహమ్మారి కంటే అంఫాన్ తుఫాను ప్రభావం దారుణంగా ఉందని, రూ. 1 లక్ష కోట్ల వరకు నష్టం కలిగి ఉండవచ్చునని ఒక ప్రకటనలో తెలిపారు.   

 

చెరువులు, ఇతర నీటి వనరులన్నీ కలుషితమ య్యాయని..  తాగునీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అక్కడి ప్రజలకు వెంటనే మంచి నీటి సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు.  బంగ్లాదేశ్ పై సైక్లోనిక్ తుఫానుగా కేంద్రీకృతమై ఉందని పేర్కొన్నారు. ఈరోజు మధ్యాహ్నం వరకు బంగ్లాదేశ్ వైపు వెళ్లాక తీవ్ర వాయుగుండంగా మారి, ఆ తర్వాత బలహీన పడుతుందని చెప్పారు. బెంగాల్ గవర్నర్ జగదీప్ ధంకర్ మాట్లాడుతూ ‘‘ఈ తుఫాను అత్యంత ఘోరమైన విపత్తు” అని అన్నారు.

 

ఇక తుఫాన్ వల్ల హౌరాలోని బొటానికల్ గార్డెన్‌లో ఉన్న మహావృక్షం తుపాను ధాటికి కుప్పకూలింది. దీంతోపాటు ఇండియ్ ఆలివ్ జాతికి చెందిన ఓ అరుదైన చెట్టును కూడా నేలకూల్చింది. అలాహాబాద్‌కు చెందిన వృక్షశాస్త్రవేత్త శివకుమార్ ఈ విషయం వెల్లడించారు.  హౌరా పార్కులోని మర్రిచెట్టు వయసు 342 ఏళ్లని, కాండం చుట్టుకొలత 15 మీటర్లని ఆయన తెలిపారు. ‘1925లో దీన్ని మూల కాండాన్ని తొలగించారు. తర్వాత బయటి ఊడలతోనే బతుకుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: