ఆదినారాయణ రెడ్డి...కడప జిల్లాలో సీనియర్ నేత. ఒకప్పుడు కాంగ్రెస్‌లో కీలక పాత్ర పోషించిన నాయకుడు. అయితే వైఎస్సార్ మరణం, జగన్ వైసీపీ పెట్టడంతో అందులోకి వెళ్ళిపోయారు. ఆ పార్టీ నుంచి 2014 ఎన్నికల్లో జమ్మలమడుగు నుంచి గెలిచారు. ఇక చంద్రబాబు ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా టీడీపీలోకి వెళ్ళి, మంత్రి పదవి కూడా దక్కించుకుని, జగన్‌పై ఓ రేంజ్‌లో విమర్శలు చేస్తూ వచ్చారు.

 

అయితే 2019 ఎన్నికలోచ్చేసరికి సీన్ రివర్స్ అయింది. ఆదినారాయణరెడ్డి టీడీపీ తరుపున కడప ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అటు జగన్ సీఎం అయిపోయారు. దీంతో తనకు కష్టకాలం మొదలైందని భావించి, టీడీపీని వదిలి బీజేపీలోకి వెళ్ళి తల దాచుకున్నారు. బీజేపీ ఎలాగో కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి, తనని వైసీపీ టచ్ చేయలేదని ధీమాతో ఉన్నారు. అందుకే ఎన్నికలయ్యాక పెద్దగా నోరుమెదపని ఆది..బీజేపీలోకి వెళ్ళాక వాయిస్ రైజ్ చేశారు.

 

మొన్నటివరకి సైలెంట్‌గా ఉండి ఇప్పుడు సడన్ ఎంట్రీ ఇచ్చి, జగన్‌పై ఫైర్ అయిపోతూ భారీ డైలాగులు వేసేస్తున్నారు. జగన్ ఎన్నో కేసుల్లో ముద్దాయి అని... ఆయన చేస్తున్న తప్పులను కేంద్రం నిశితంగా పరిశీస్తోందని, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందని అంటున్నారు. న్యాయస్థానాలను తప్పు పడితే సర్వనాశనం అవుతారని, జగన్‌కు సిగ్గు... శరం ఉంటే వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని, కోర్టు ముక్కు పగిలేలా.. పళ్లు రాలేలా కొట్టినా ముఖ్యమంత్రికి సిగ్గు లేదని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడేశారు.

 

అయితే ఇన్నిరోజులు జగన్‌పై అక్కసుని ఆది నారాయణ ఒక్కసారే వెళ్లగక్కినట్లు కనపడుతుంది. అందుకే భారీ భారీ డైలాగులు వేసేశారు. కానీ ఆది విమర్శలు కేవలం డైలాగులు గానే మిగిలిపోనున్నాయి. ఎందుకంటే ఎలాంటి అవినీతి లేకుండా పాలన చేస్తున్న జగన్‌కు ఏపీ ప్రజల ఫుల్ సపోర్ట్ ఉంది. అటు కేంద్ర మద్ధతు కూడా ఉంది. కాబట్టి ఆది నారాయణరెడ్డి కేవలం విమర్శలు చేస్తూ మాత్రమే ఆత్మసంతృప్తి చెందాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: