మే 23 2019 ఏపీ రాజకీయ చరిత్రలో మరిచిపోలేని రోజు. జగన్ ఊహించని విజయం సాధించిన రోజు. ఓ 100 సీట్లు పైనే సాధించి జగన్ ఎలాగోలా అధికారంలోకి వస్తారని చాలామంది అనుకున్నారు గానీ...అసలు జగన్ కూడా ఊహించని విధంగా ఏపీ ప్రజలు వైసీపీకి 151 సీట్లు ఇచ్చారు. అలాగే అప్పటివరకు అధికారంలో ఉన్న 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబుకు 23 సీట్లు ఇచ్చారు. ఇక సినిమాల్లో అదిరిపోయే క్రేజ్ ఉన్న పవన్ కల్యాణ్‌ని రెండుచోట్ల ఓడించి, జనసేన పార్టీకి 1 సీటు మాత్రం ఇచ్చారు.

 

అయితే జగన్ అదిరిపోయే మెజారిటీతో గెలిచి ఈ 23తో సంవత్సరం పూర్తి అయింది. ఇక దీంతో వైసీపీ శ్రేణులు ఆనందంతో సోషల్ మీడియాలో జగన్ విజయంపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇదే సమయంలో రాజకీయాల్లో చాలా జూనియర్ అయిన జగన్ గెలిచి, సీనియర్ అయిన తమ నేత చంద్రబాబు ఓడిపోయి కూడా సంవత్సరం కావడంతో తెలుగు తమ్ముళ్ళు, తమ కడుపు మంటని కూడా చూపిస్తున్నారు.

 

మే 23 అంటే రాష్ట్రానికి శని పట్టిన రోజు, రాక్షసులు పండుగ చేసుకునే రోజు, అభివృద్ధి కోరుకునే వాళ్లు బాధపడే రోజు’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. గత ఏడాది ఇదే రోజున జగన్‌కు ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని దోచుకునేందుకు లైసెన్స్ వచ్చిన రోజు అని బుద్దా వెంకన్న లాంటి వారు మాట్లాడుతున్నారు.

 

దీంతో వైసీపీ కార్యకర్తలు కూడా తెలుగు తమ్ముళ్ళకు స్ట్రాంగ్ కౌంటర్లు వస్తున్నారు. రాష్ట్రానికి శని వదిలి కరెక్ట్ గా సంవత్సరం అయిందని కామెంట్లు చేస్తున్నారు. అబద్దాలు, అవినీతి, గ్రాఫిక్స్, భజన, దోపిడి పాలన ముగిసి ఏడాది అయిందని అంటున్నారు. ఇక ఎన్నికలు అయ్యాక ఫలితాలు వచ్చే వరకు భజన చేసి, అధికారం మనదే అంటూ తమ్ముళ్ళు..బాబుని పైకి లేపి 23తేదీన ఒక్కసారిగా కిందపడేశారని గుర్తుచేస్తున్నారు. ఏదేమైనా రాష్ట్రానికి పట్టిన శని వదిలి ఏడాది పూర్తి అయిందని ఎద్దేవా చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: