ప్రస్తుతం చైనా మీద కోపంతో చాలా మటుకు ప్రపంచ దేశాలు చైనాలో పెట్టుబడులు పెట్టేందుకు వెనుకడుగు వేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన వారు కూడా తమ పెట్టుబడులను వెనక్కి  చేసుకుంటున్నారు. ఇక చాలా కంపెనీలు చైనా మీద కోపంతో భారత్ వైపు చూస్తున్నాయి. భారత్తో సంబంధాలు మెరుగు పరుచుకోవడానికి సిద్ధమవుతున్నాయి. ఇదే సమయంలో అమెరికా కూడా కొన్ని కంపెనీలను భారత్ కి వెళ్లి పెట్టుబడులు పెట్టాలంటూ సూచనలు సలహాలు ఇస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అగ్రరాజ్యాలు భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యారు. 

 

 

 అయితే దక్షిణ కొరియా కు సంబంధించినటువంటి చాలా కంపెనీలు ఇండియాలో కంపెనీలు స్థాపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో జపాన్ చజర్మనీ లకు సంబంధించిన కంపెనీలు కూడా ప్రస్తుతం భారతదేశంలో వివిధ ప్రాంతాలలో తమ కంపెనీల స్థాపించేందుకు ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో అటు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఎంతో మంది  నిపుణులు.. విదేశీ కంపెనీలతో టచ్ లోకి వెళ్లి భారతదేశంలోకి పెట్టుబడులను కొత్త కంపెనీలని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు కూడా సిన్సియర్ గా జరుగుతున్నట్లు సమాచారం. అయితే తాజాగా మరో దేశం కూడా భారతదేశంతో  జుట్టు కట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 

 

 ఆ దేశమే  ఆస్ట్రేలియా. భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు అవసరమైన ఒప్పందాలను ఆస్ట్రేలియా చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ముందుగా డిఫెన్స్ వ్యాపార అగ్రిమెంట్లు భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే భారత సామాగ్రి తయారీపై సీరియస్గా దృష్టి పెట్టిన నేపథ్యంలో ఈ ఒప్పందం జరిగితే రక్షణ రంగ సామాగ్రి తయారీపై పూర్తిస్థాయిలో భారత్ దృష్టి పెట్టే అవకాశం ఉంది . ఇతర దేశాల కంటే అతి తక్కువ ధరకే ప్రస్తుతం ఆస్ట్రేలియాకు ఆయుధ సామాగ్రి అందించనుంది భారత్... ఇది భారత అభివృద్ధి చెందడానికి ఉపయోగపడనుంది అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: