పాకిస్థాన్లోని కరాచీలో ఘోర విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ప్రయాణికులతో వెళ్తున్న విమానం ఏకంగా  టెక్నికల్ ప్రాబ్లం రావడంతో రెండు మూడు సార్లు ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ... ప్రమాదవశాత్తు జనావాసాల్లో నే కుప్పకూలిపోయింది. దీంతో ఏకంగా విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులతో పాటు సాధారణ ప్రజలు కూడా ఎంతో మంది చనిపోయారు. ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనం గా మారిపోయింది. అయితే ఈ విమాన ప్రమాదం జరగకుండా పైలెట్లు శాయశక్తులా ప్రయత్నాలు చేసినప్పటికీ... చివరికి ప్రమాదం మాత్రం జరిగిపోయింది. దీంతో ఈ ఘటనలో ఏకంగా మృతుల సంఖ్య 80 కి పైగానే ఉంది. 

 


 ఇక ఈ విమాన ప్రమాదం వెనుక ఉన్న కారణాల గురించి ప్రస్తుతం ప్రపంచం మొత్తం శోధిస్తుంది. విమానం ఎక్కడిది... ప్రమాదం ఎలా జరిగింది.. ఎంత మంది ప్రయాణికులు ఉన్నారు అనే విషయాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు చాలామంది. అయితే ప్రస్తుతం పాకిస్తాన్ దగ్గర అక్కడ తయారయ్యే ఎటువంటి విమాన  నిర్మాణాలు ఏవీ లేవు వేరే వాళ్ల దగ్గర లీజుకు తీసుకోవడమో  కొనుక్కోవడమో  జరిగి ఉండాలి. అయితే ఈ కూలిన విమానం చైనా నుంచి లీజుకు తీసుకున్నటువంటి విమానం అనే చర్చ ప్రస్తుతం నడుస్తోంది. అయితే ప్రస్తుతం విమానం లాండింగ్ కోసం రెండు 2 రన్ వే లు  సిద్ధం చేశారు అధికారులు. 

 

 అయితే విమానం లాండింగ్ లో ఏకంగా కింది వరకు వచ్చిన తర్వాత రెండు ఇంజన్లు పాడై  ప్రమాదం జరిగి నటువంటి నేపథ్యంలో... ప్రస్తుతం రెండు రకాల వాదనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే ఈ విమానాన్ని చైనా నుంచి లీజుకు తీసుకున్నారు... అయితే చైనా విమానాన్ని వాడిన తర్వాత పాకిస్తాన్ కు ఇచ్చింది అని ఒక వాదన వినిపిస్తోంది. అంతేకాకుండా విమానం ఇంజన్లకు  సంబంధించిన రిపేరింగ్ కూడా చైనా ప్రభుత్వమే చూసుకుంటుంది అని మరో వాదన కూడా వినిపిస్తోంది. అయితే ఈ వాదన తెరమీదకు వచ్చేలా చేసింది కేవలం చైనా మీద కోపం ఉన్న వాళ్ళ... నిజంగా ఇదే జరిగిందా అన్నది మాత్రం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: