భారతదేశంపై చుట్టూ ఉన్న ఇతర దేశాలు ఎప్పుడెప్పుడు దాడి చేసి భూభాగాన్ని స్వాధీనం చేసుకోవాలా అని  ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా పాకిస్తాన్ లో అయితే భారత దేశాన్ని నాశనం చేయడానికి ఎన్నో ఉగ్రవాద సంస్థలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. భారత దేశ సరిహద్దు లోకి చొరబడి భూమిని ఆక్రమించడం విధ్వంసం సృష్టించడం చేస్తూ ఉంటారు ఉగ్రవాద సంస్థలు. అదే సమయంలో అటు చైనా కూడా భారత అభివృద్ధినీ  ఎప్పటికప్పుడు అడ్డుకుంటూ.. అడ్డంకులు సృష్టిస్తూ ఉంటుంది. అయితే ప్రస్తుతం భారతదేశం చుట్టూ ఉన్న పాకిస్తాన్ నేపాల్ లతో పోలిస్తే ఆర్థికంగా పటిష్ఠంగా ఉన్న దేశం చైనా. దీంతో చైనా చెప్పిందే శాసనం గా మారిపోతుంది ఆయా దేశాలకు. 

 


 అయితే భారత్ అభివృద్ధి కుంటుపడేలా చేయడం ద్వారా చైనా ను మరింత అభివృద్ధి చేసుకోవచ్చు అనే భావనతో చైనా ప్రభుత్వం ఎన్నో కుట్రలు పన్నుతూ ఉంటుంది. ఇక మొన్నటి వరకు భారతదేశంలో మిత్ర దేశంగా ఉన్న నేపాల్ దేశానికి కూడా తనవైపు తిప్పుకొని ప్రస్తుతం భారత్ పై  కయ్యానికి కాలుదువ్వేలా చేసింది చైనా. అయితే అటు పాకిస్తాన్ను భారత్ పై  ఉగ్ర దాడులు జరిపేలా  చైనా ప్రభుత్వం రెచ్చగొడుతుంది. ఈ నేపథ్యంలో భారతదేశం పై దాడి చేయడానికి పాకిస్తాన్ ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. అటు భారత సైన్యం మాత్రం ఎప్పటికప్పుడు పాకిస్తాన్ ఎత్తుగడలను చిత్తు చేస్తూ ఉంది. అదే సమయంలో అటు నేపాల్ కి కూడా అప్పుల విషయంలో హామీలు ఇచ్చి ప్రస్తుతం భారత దేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసేలా చేసింది. 

 


 ఇలా చేయడం ద్వారా భారత దేశానికి వచ్చే పెట్టుబడులను ఆపి భారత దేశం కంటే చైనాలో పెట్టుబడులు పెట్టడమే ఎంతో మేలు అని పలు కంపెనీలు తమ వైపు లాక్కుని భారతదేశం అభివృద్ధి కుంటుపడేలా  చేయాలి అన్నది ప్రస్తుతం చైనా వ్యూహం. అయితే అటు పాకిస్థాన్ కి నేపాల్ కి ఆర్థిక సహాయం అందిస్తున్న చైనా ప్రస్తుతం ఈ రెండు దేశాలలో భారత్ పై సంచలన వ్యాఖ్యలు చేసేలా రెచ్చగొడుతుంది. అదే సమయంలో చైనా ప్రభుత్వం కూడా రెచ్చిపోతుంది. భారత దేశం  పై తీవ్ర  స్థాయిలో విమర్శలు చేస్తోంది. అయితే ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కోవడానికి అటు భారత సైన్యం కూడా సంసిద్ధమవుతోంది. మరి ఈ పరిస్థితుల్లో ఎక్కడ వరకు దారి తీస్తాయో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: