చైనా దేశంలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా కొద్ది నెలల్లోనే విస్తరించింది. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలను తల్లకిందులు చేసింది కరోనా వైరస్. ఈ వైరస్ వల్ల ప్రపంచంలో అగ్రరాజ్యం అని పిలవబడే అమెరికా సైతం ఏం చేయలేని పరిస్థితికి దిగజారి పోయింది. సంపన్న దేశాలు అభివృద్ధి చెందిన దేశాలుగా పిలవబడే యూరప్ దేశాలలో కరోనా వైరస్ దెబ్బకి పిట్టల్లా రాలిపోయారు జనాలు. యూరప్ మరియు అమెరికా దేశాలలో ఈ వైరస్ ప్రవేశించడంతోనే భయంకరంగా ప్రమాదకరంగా విజృంభించింది. ఇటలీ, స్పెయిన్, అమెరికా దేశాలలో అయితే కరోనా వైరస్ మరణ విలయతాండవం చేసింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

 

అటువంటి ఈ మహమ్మారి వైరస్ చైనా పక్కనే ఉన్న ఇండియాలో మాత్రం అంతగా ప్రభావం చూపెట్ట పోవటానికి కారణం గురించి ప్రముఖ వైద్యుడు ఇటీవల ఓ ప్రముఖ తెలుగు టీవీ చానెల్ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో వైరాలజిస్ట్ గా, వ్యాపారవేత్తగా ఉన్న డాక్టర్ ఎమ్.ఎస్.రెడ్డి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇండియన్స్ లో సహజంగా ఉండే యాంటి బాడీలు కరోనాను ఎదుర్కుంటాయని, అందువల్ల మరీ భయపడనవసరం లేదని అన్నారు. ముఖ్యంగా కరోనా వైరస్ లో ఎక్కువగా కొవ్వు శాతం పదార్థం ఉంటుంది. కాబట్టి సబ్బుతో చేతులు కడుక్కుంటే పోతుంది. 80% మంది ఇలాగే రక్షణ పొందుతారని ఆయన అన్నారు. ప్రజల అతి శుభ్రతే... కొన్ని ప్రాంతాలలో అనర్థానికి కారణమని విశ్లేషించారు.

 

ఇండియాలో అపరిశుభ్రతతో సాల్మనెల్లా, డయేరియా వంటివి వస్తాయి. వాటికి యాంటీ బ్యాక్టీరియల్ మందులు వాడుతుంటాం. అమెరికన్లు బ్యాక్టీరియా రహిత ఆహారం ఎక్కువగా తీసుకోవడంతో సమస్యలు వస్తున్నాయి. అమెరికాలో శుద్ధి చేసిన ఆహారంలో ఒక గ్రాముకు... 10-100 బ్యాక్టీరియాలు కూడా ఉండవు. కానీ భారత్ లో లక్షలు, మిలియన్లలో ఉంటాయి. ఆహారంలో బ్యాక్టీరియాలు లేకపోతే మన రోగనిరోధక వ్యవస్థ శత్రువును ఎదుర్కొనే స్థాయిలో వృద్ధి చెందదని ఆయన అన్నారు. కాబట్టి ఇండియన్స్ లో ఎక్కువగా రోగనిరోధక శక్తి ఉండటంతో కరోనా వైరస్ అంతగా ప్రభావం చూపెట్ట లేకపోయింది అన్నట్టుగా డాక్టర్ ఎమ్.ఎస్.రెడ్డి తెలిపారు 

మరింత సమాచారం తెలుసుకోండి: