లాక్ డౌన్ వల్ల ఇండియాలో పేదవారు తో పాటు వలస కూలీలు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొనడం అందరం చూశాం. బతుకు తెరువు కోసం పుట్టిన ఊరిని విడిచి పెట్టి ఇతర ప్రాంతాలలో కూలి పనులకు వెళ్లిన వారు కరోనా లాక్ డౌన్ దెబ్బకు ఎక్కడికక్కడ ఇరుక్కుపోయారు. దేశ వ్యాప్తంగా రవాణా మొత్తం స్తంభించి పోవడంతో ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. అదేవిధంగా ఎక్కడికక్కడ రాష్ట్ర సరిహద్దులు క్లోజ్ అవటంతో వలస కార్మికులు భయంకరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో దేశ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది వలస కూలీలు కాలినడకన వేల కిలోమీటర్లు నడవడం వారు పడిన ఇబ్బందులు వర్ణించలేనివి అని చెప్పవచ్చు. ఇటువంటి సమయంలో ఓ బాలిక తన తండ్రి నడవలేని స్థితిలో ఉండటంతో సైకిల్ పై కూర్చోబెట్టుకుని ఏకంగా 12 వందల కిలోమీటర్లు ప్రయాణించింది. బీహార్ కి చెందిన 15 ఏళ్ల బాలిక లాక్ డౌన్ వల్ల పనులు లేకపోవడంతో కాలినడకన వందల వేల కిలోమీటర్లు నడుచుకుంటూ ఊరు బాటపట్టారు.

 

లాక్ డౌన్ ముందు తన తండ్రి కి ప్రమాదం జరగటంతో పనిచేస్తున్న చోట ఇంటికే పరిమితమయ్యాడు. దీంతో ఆదాయం లేకపోవటం మరోపక్క లాక్ డౌన్ వల్ల పనులు లేకపోవడంతో వెంటనే ఆ పదిహేను సంవత్సరాల బాలిక పేరు జ్యోతి తన తండ్రిని తీసుకొని సొంత రాష్ట్రం బీహార్ కి వెళ్ళాలి అని నిర్ణయించుకుంది. అది కూడా సైకిల్ మీద. చుట్టుపక్కల ఉన్న వారు ఎంత చెప్పినా వినలేదు. ఎలాగైతే 15 సంవత్సరాల జ్యోతి తన తండ్రిని సైకిల్ ఎక్కించుకొని పన్నెండు వందల కిలోమీటర్లు తొక్కుకుంటూ మధ్యలో కొంతమంది ట్రక్ డ్రైవర్ లిప్ట్ తీసుకుని మొత్తమ్మీద ఏడు రోజుల్లో గమ్యస్థానానికి చేరుకుంది.

 

దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో రావడంతో వైరల్ కావటంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ ప్రశంసలు కురిపించారు. భారతీయ ప్రజల ప్రేమ, ఓర్పునకు ఇదో అందమైన ఫీట్ అని ఆమె అభివర్ణించారు. ఆ బాలిక సాహసాన్ని ఇవాంకా ప్రశంసించగా.. నెటిజన్లు మాత్రం ఇది ప్రభుత్వ వైఫల్యమని నిప్పులు చెరిగారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: