రెండేళ్ళుగా మహానాడు తెలుగుదేశం పార్టీ నిర్వహించలేదు. గత ఏడాది ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురైంది. లేకపోతే అధికారం చేతిలో ఉంటే ధూం ధాం గా మహానాడు టీడీపీ నిర్వహించుకుని తమను తాము ఒకటికి వందసార్లు పొగుడుకునేదే. ఈసారి మాత్రం మహానాడుకు పరిస్థితులు అనుకూలించకపోయినా తెలుగుదేశం అధినాయకత్వం మాత్రం బాగా ఆత్రపడుతోంది. 

 

జూమ్ వీడియో సమావేశాలు నిర్వహించి మరీ మహానాడు నిర్వహించాలని ఆలోచిస్తోంది. దానికి గల బలమైన కారణం ఏంటి అంతే అర్జంటుగా లోకేష్ కి పార్టీలో  పెద్ద పదవి అప్పగించలన్న ఆలోచనతోనేనని అంటున్నారు. లోకేష్ మంత్రిగా ఉంటూ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి మంగళగిరిలో ఓడిపోయాడు. అటువంటి లోకేష్ కి పార్టీఎలో పెద్ద పదవి ఇచ్చి టీడీపీని మెల్లగా అతని చేతుల్లో పెట్టాలని పాటీ పెద్దలు రెడీ అవుతున్నారా అన్న డౌట్లు వస్తున్నాయి.

 

చంద్రబాబు ఇకపైన కరోనా మహమ్మారి కారణంగా చురుకుగా తిరగలేరని అంటున్నారు. దాంతో  లోకేష్ కే పార్టీ బాధ్యతలు అన్నీ అప్పగించి తాను కేవలం అధ్యక్షుడిగా ఉండిపోవాలని చూస్తున్నట్లుగా పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. అలాగే లోకేష్ తో పాటు మొత్తం యువతకు పెద్ద పీట వేస్తారని చెబుతున్నారు.

 

అంటే ఓ విధంగా లోకేష్ వద్దని అనుకున్న వారు, సీనియర్లు పార్టీ నుంచి తప్పుకుంటారు, లేదా వారిని తప్పిస్తారన్నమాట. ఇకపైన పార్టీ భారమంతా చినబాబుదేనని చెప్పడానికి ఆమోదముద్ర వేసుకోవడానికే మహానాడుని కరోనా టైంలో కూడా నిర్వహిస్తున్నారని అంటున్నారు. ఒక వేళ లోకేష్ కి కీలకమైన బాధ్యతలు అప్పగిస్తే టీడీపీలో ఏ రకమైన పరిణామాలు సంభవిస్తాయోనన్న ఆందోళన కూడా అభిమానుల్లో ఉందని అంటున్నారు. 

 

ఏది ఎలాగున్నా జూనియర్ ఎన్టీయార్ ని పార్టీలోకి తీసుకురావాలని టీడీపీలో ఒక వర్గం బలంగా కోరుకుంటున్న నేపధ్యంలో లోకేష్ కి పట్టం కట్టి ఇక్కడ సీటు ఖాళీ లేదు అని చెప్పే ప్రయత్నమే ఈ మహానాడు అని అంటున్నారు. చూడాలి ఈ రకమైన ప్రచారం ఎంతవరకూ నిజమో కాదో మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: