తెలంగాణ లో ఈరోజ్హు కూడా భారీగా కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం కొత్తగా 52కేసులు నమోదు కాగా 25మంది కోలుకున్నారని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. ఈకొత్త కేసుల తోకలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో  మొత్తం కేసుల సంఖ్య 1813కి చేరగా అందులో 1068 మంది బాధితులు కోలుకోగా 49మంది మరణించారు.  ప్రస్తుతం 696కేసులు యాక్టీవ్ గా వున్నాయి. 
 
ఇక దేశ వ్యాప్తంగా ఈరోజు కూడా 3500కు పైగాకరోనా  కేసులు నమోదయ్యాయని సమాచారం. దాదాపు అన్ని రాష్ట్రాల్లో కేసులు భారీగా నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా  మహారాష్ట్రలో 2608 కేసులు నమోదు కాగా తమిళనాడు లో 759, ఢిల్లీ లో 591,గుజరాత్ లో 398 కేసులు నమోదయ్యాయి. ఓవరాల్ గా ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 131000 కు చేరింది. అటు విదేశాల నుండి అలాగే ఇతర రాష్ట్రాల నుండి సొంత రాష్ట్రాల కు వస్తున్న వారి వల్ల  గత కొద్దీ రోజులనుండి  దేశంలో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇదిలావుంటే ప్రస్తుతం లాక్ డౌన్ 4 కొనసాగుతుండగా మే 31 తో ముగియనుంది. ఇప్పటికే  దాదాపు అన్ని మినహాయింపులు ఇచ్చిన కేంద్రం మరోసారి లాక్ డౌన్ పెంచడం అసాధ్యంగానే కనిపిస్తుంది అయితే ప్రస్తుతం కరోనా తీవ్ర రూపం దాల్చడం తో లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయాలనే డిమాండ్ కూడా వినిపిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: